Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.4,071 కోట్లకు ఆమోదం
న్యూఢిల్లీ: దేశంలో రెండు ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ రంగంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రూ.4,071 కోట్ల పెట్టుబడులు పెట్ట నున్నట్లు తెలిపింది. దీనికి సోమ వారం పవర్ గ్రిడ్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం తెలిపారని ఆ కంపెనీ బిఎస్ఇ ఫైలింగ్‌లో తెలిపారు. కర్నూల్ విండ్ ఎనర్జీ జోన్ / సోలార్ ఎనర్జీ జోన్ (ఎపి) పార్ట్ ఎ, పార్ట్ బి కోసం రూ.3,546.94 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపింది. 2024 నవంబర్ ఈ ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని వెల్లడించింది. అదే విధంగా ఈస్టర్న్ రీజియన్ విస్తరణ స్కీమ్‌కు రూ.524.04 కోట్ల వ్యయం చేయనున్నాట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు నవంబర్ 2025 నాటికి అందుబాటులోకి రానుందని పేర్కొంది.