Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశల వారిగా 550 విద్యుత్ బస్సుల పంపిణీ
- త్వరలోనే మొదటి ఆర్డర్ సరఫరా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నుంచి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు 550 విద్యుత్ బస్సుల భారీ ఆర్డర్ లభించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్)కు చెందిన ఒజిఎల్ 500 ఇంట్రాసిటీ, 50 ఇంటర్సిటీ బస్సు లను సరఫరా చేయనుంది. ఈ ఆర్డర్ దక్షిణ భారతదేశంలోనే తమకు అతి పెద్దదని ఓజీఎల్ సిఎండి కెవి ప్రదీప్ తెలిపారు. ''పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తాము మరిన్ని విద్యుత్ బస్సులను తీసుకురావాలని నిర్ణయిం చాము. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 3,400 ఇవి బస్సులను అందు బాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నాము.'' అని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్, ఎంఎల్ఎ బాజీరెడ్డి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. ''మార్చి 2025 నాటికి హైదరాబాద్ అంతటా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. తొలి దశలో 550 ఈ-బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జీసీసీ) పద్ధతిలో తీసుకుంటున్నాము. ఈ బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయి.'' అని టిఎస్ఆర్టిసి ఎండి విసి సజ్జనార్ తెలిపారు. ''స్థిరమైన, ఆర్థికంగా బలమైన, పెద్ద ఎత్తున ప్రజా రవాణా చేసే టిఎస్ఆర్టిసితో కలిసి పనిచేసే అవకాశం మరోసారి వచ్చినందుకు మేము గర్విస్తున్నాము. ఈ బస్సులు నగరంలో ధ్వని, వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించి ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి'' అని కెవి ప్రదీప్ వెల్లడించారు. టీఎస్ఆర్టీసీతో ఒలెక్ట్రా అనుబంధం 40 ఎలక్ట్రిక్ బస్సుల ఆర్డర్‌తో మార్చి 2019లోనే ప్రారంభమైందని ప్రదీప్ తెలిపారు. ప్రస్తుతం ఈ బస్సులు విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో సేవలంది స్తున్నాయన్నారు. నాలుగేళ్ల తర్వాత మరోసారి భారీ ఆర్డర్ దక్కిందన్నారు.