Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మెల్బోర్న్ విశ్వవిద్యాలయం భారతీయ విద్యార్థులకు నూతన బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ డ్యుయల్ డిగ్రీని పూర్తి చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది, ఈ ఘనత చెన్నైలోని మద్రాసు విశ్వవిద్యాలయం, సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం, మరియు గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (హైదరాబాదు)తో పెంపొందించుకున్న భాగస్వామ్యాలది అయి ఉంటుంది. కొత్త డ్యుయల్ డిగ్రీలో నమోదు చేసుకునే విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు ఇండియాలో చదువుతూ, ఆ తర్వాత రెండు సంవత్సరాలు మెల్బోర్న్ క్యాంపస్ యందు చదువుతూ తమ డిగ్రీని స్వదేశంలో మరియు విదేశంలో పూర్తి చేసుకోగలిగి ఉంటారు.
వారు తమ చదువును విజయవంతంగా పూర్తి చేసుకోగానే, మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి భారతీయ విద్యార్థులకు బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ప్రదానం చేయబడుతుంది, మరియు వారు స్థానిక విద్యాసంస్థచే డిగ్రీ ప్రదానం చేయబడే ఐచ్ఛికాన్ని కలిగి ఉంటారు. అదనంగా, భారతీయ విద్యార్థులు తమ అంతిమ సంవత్సరంలో ఆరు మాస్టర్స్ సబ్జెక్టులను చదువుకోవచ్చు, తద్వారా వారు సైన్స్, ఇంజినీరింగ్, ప్రజారోగ్యం మరియు డేటా సైన్స్ తో సహా ఒక కూర్పు సబ్జెక్టుల నుండి వేగవంతమైన మాస్టర్స్ డిగ్రీ పొందవచ్చు.
ఆస్ట్రేలియా ప్రధానమంత్రి వాణిజ్య ప్రతినిధి బృందము భారతదేశ పర్యటనతో పాటుగా పాల్గొన్న మెల్బోర్న్ విశ్వవిద్యాలయము వైస్-ఛాన్సలర్ డంకన్ మాస్కెల్ గారు ముంబైలో ఈ డ్యుయల్ డిగ్రీని ప్రకటించారు.
కొత్త డ్యుయల్ డిగ్రీ, మెల్బోర్న్ విశ్వవిద్యాలయముచే సహ- రూపకల్పన చేయబడి, నాణ్యతా భరోసా పొందిన బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ (సమ్మిళితం)కి తార్కికమైన తర్వాతి అడుగు అవుతుందని, మరియు అది ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఏడు విద్యాసంస్థలచే అందజేయబడుతోందని ప్రొఫెసర్ మాస్కెల్ అన్నారు.
“ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు తమ చదువును పూర్తి చేసుకోవడానికి ప్రత్యక్ష మార్గాలను ఇవ్వడానికై మా కార్యక్రమాల విస్తరణను కొనసాగించడం పట్ల మెల్బోర్న్ విశ్వవిద్యాలయం ఆనందిస్తోంది,” అని ప్రొఫెసర్ మాస్కెల్ అన్నారు. “ప్రస్తుతమున్న మా కార్యకలాపాల ఎదుగుదలను కొనసాగించాలనే డిమాండుతో, ఇండియాలో మరియు మా స్వదేశం ఆస్ట్రేలియాలో విద్య యొక్క అంతర్జాతీయకరణ యొక్క భాగంగా ప్రతిష్టాత్మక స్థానిక విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేయడానికి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము.”
మద్రాసు విశ్వవిద్యాలయం, SPPU మరియు గీతం, బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ డ్యుయల్ డిగ్రీలో మొట్టమొదటి భాగస్వాములు. తదుపరి చర్చలు కొనసాగుతూ ఉండగా 2024 నుండి మరిన్ని విద్యా సంస్థలు డ్యుయల్ డిగ్రీని అందించాలని చూస్తున్నాయి. ప్రొఫెసర్ మాస్కెల్ వెంట గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం, మద్రాసు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డా. ఎస్. గౌరి, మరియు సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం (SPPU) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డా. కర్భారి విశ్వనాథ్ కాలే గార్లు ఉన్నారు.
మద్రాసు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ డా. ఎస్. గౌరి ఇలా పేర్కొన్నారు:
“మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో సుదీర్ఘమైన మా భాగస్వామ్యం పట్ల మేము గర్విస్తున్నాము, మరియు మా విద్యార్థులకు మరొక అంతర్జాతీయ అభ్యసనావకాశాన్ని సానుకూలం చేయడం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా విద్యార్థులు అంతర్జాతీయీకరణ చేయబడిన విద్య సృష్టించే ఆప్షన్లు మరియు అవకాశాలను ఆనందిస్తున్నట్లుగా ప్రస్తుతమున్న మా బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ (సమ్మిళితం) కార్యక్రమంలోని ఆసక్తి స్థాయి ప్రదర్శిస్తోంది.”
సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం (SPPU) వైస్- ఛాన్సలర్ ప్రొఫెసర్ డా. కర్భారి విశ్వనాథ్ కాలే ఇలా అన్నారు:
“బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ డ్యుయల్ డిగ్రీ భారతీయ జాతీయ విద్యా విధానమునకు అనువుగా రూపొందించబడింది, అది మెల్బోర్న్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ విద్యా సంస్థలతో భావమార్పిడి మరియు సంభాషణల్ని ప్రోత్సహిస్తుంది. మా విద్యార్థులు అంతర్జాతీయ అవకాశాలను ఒడిసి పట్టడానికి మరియు తమ స్వంత భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవడానికి వీలు కలిగించే విద్యార్హతతో గ్రాడ్యుయేట్ పట్టా పొందడానికి అవసరమైన పునాదిని వృద్ధి చేసుకుంటారు. వారు వేగంగా-మాస్టర్స్ డిగ్రీని సంపాదించుకోవడానికి తమ తదుపరి డిగ్రీ చదువును కొనసాగించగలుగుతారు, అదే విధంగా పొడిగించబడిన వీసా పథకాల క్రింద ఆస్ట్రేలియాలో ఉపాధిని పొందగలుగుతారు లేదా ఉత్తర అమెరికా మరియు యూరప్ లోని అగ్రగామి విద్యాసంస్థలు అందించే డిగ్రీకి దీటైన అధునాతన డిగ్రీతో ఇండియాకు గానీ లేదా మరో చోటుకు గానీ తిరిగి రాగలుగుతారు. విద్యాబోధకులు మరియు పరిశోధకులు సాంకేతికత బదిలీని మార్పిడి చేసుకోవడానికి కూడా ఇది సహాయకారిగా ఉంటుంది."
గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం ఇలా పేర్కొన్నారు:
“మెల్బోర్న్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యముతో, బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ జాయింట్ డిగ్రీ, STEM లో మా తర్వాతి తరం శాస్త్రవేత్తలు మరియు నాయకులను విద్యావంతుల్ని చేస్తుంది మరియు సాధికారపరుస్తుంది. ఈ విద్యార్థులు స్వదేశం ఇండియాలో గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ యందు అందుబాటులో ఉన్న అత్యుత్తమ అవకాశాలను ప్రాప్యత చేసుకుంటారు , మరి ఆ తర్వాత మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయంగా చదువుకోవడం ద్వారా తమ గ్రాడ్యుయేట్ చదువు ఆప్షన్లను విస్తృతం చేసుకుంటారు”
తదుపరి సమాచారము: (తదుపరి బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ సమాచార పత్రము మీడియా కిట్ యందు ఉంది)
బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ (సమ్మిళితం)
- బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ (సమ్మిళితం) అనేది మూడు- సంవత్సరాల డిగ్రీ, ఇందులో ఇండియాలోని ఉన్నత విద్యా సంస్థలు, మెల్బోర్న్ విశ్వవిద్యాలయం వారిచే సహ-రూపకల్పన చేయబడి మరియు నాణ్యతా భరోసా ఇవ్వబడే వినూత్నమైన సైన్స్ పాఠ్యాంశ ప్రణాళికను అందిస్తాయి.
- బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ (సమ్మిళితం) 2016 లో ప్రారంభించబడింది, మరియు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఏడు విద్యాసంస్థలచే అందించబడుతోంది:
- SPPU సావిత్రీబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం – 2018 నుండీ
- మోడరన్ కాలేజ్ గణేష్ఖిండ్ (SPPU అనుబంధ సంస్థ) – 2019 నుండీ
- మోడరన్ కాలేజ్ శివాజీ నగర్ (SPPU అనుబంధ సంస్థ) – 2016 నుండీ
- PVKN ప్రభుత్వ కళాశాల చిత్తూరు (శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ అనుబంధ సంస్థ) – 2021 నుండీ
- హైదరాబాదు లోని గీతం యూనివర్సిటీ – 2019 నుండీ
- భారతీయార్ యూనివర్సిటీ – ప్రారంభం కావాల్సి ఉంది
- చెన్నై లోని మద్రాసు విశ్వవిద్యాలయం – 2022 నుండీ
- బ్యాచెలర్ ఆఫ్ సైన్స్ (సమ్మిళితం) 2016 నుండీ అంకెలు నిలకడగా పెరుగుతూ 2023 ఫిబ్రవరి నాటికి 382 నమోదులను రికార్డు చేసుకొంది.
- 97 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ పట్టా పొందారు, ఐదుగురు మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో తదుపరి గ్రాడ్యుయేట్ చదువును కొనసాగిస్తున్నారు:
- ముగ్గురు మాస్టర్ ఆఫ్ సైన్స్ (బయోసైన్సెస్) చదువుతుండగా, అందులో ఇద్దరు ఇప్పుడు పిహెచ్డి పూర్తి చేస్తున్నారు
- ఒకరు మాస్టర్ ఆఫ్ బయోటెక్నాలజీ చేస్తున్నారు
- ఒకరు మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఫైనాన్స్) చేస్తున్నారు