Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిటోనియల్ డయాలసిస్ గురించి దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులకు
నవతెలంగాణ - హైదరాబాద్
డయాలసిస్ కేర్‌లో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న బాక్ట్సర్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ ఇప్పుడు ‘చూజ్ ఫ్రీడమ్’ ప్రచారం ప్రారంభించింది. సమయానికి డయాలసిస్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత తెలపడంతో పాటుగా తుది దశ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రోగులు (ఈఎస్కెడీ) రోగులకు పెరిటోనియల్ డయాలసిస్ (పీడీ) చికిత్స పట్ల అవగహన సైతం మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకుంది. దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరంగా మారాయి. దాదాపు 850మిలియన్ల మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. మధుమేహంతో పాటుగా అభివృద్ది చెందే సీకెడీ కారణంగా కిడ్నీ ఫెయిల్యూర్ కూడా కావొచ్చు. ఈ ఆరోగ్య ఆందోళనలను పరిష్కరించేందుకు తప్పనిసరిగా చర్యలను తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా సేవలనందిస్తున్న డాక్టర్ రవి ఆండ్రూస్ మాట్లాడుతూ ‘‘ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా అతి సహజంగా కనిపిస్తోన్న సమస్యగా కనిపిస్తుంది. డయాలసిస్ చికిత్స ఆలస్యం అయినట్లయితే రోగి యొక్క క్లీనికల్ పరిస్ధితి వేగంగా క్షీణించే అవకాశం ఉంది. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ రోగులకు సహాయకారులుగా ఉంటూ మెరుగైన నిర్ణయాలను తీసుకోవడంలో సహాయపడుతున్నారు. పెరిటోనియల్ డయాలసిస్ (పీడీ) లేదా ఇంటి వద్దనే డయాలసిస్ పలు క్లీనికల్ మరియు జీవిత నాణ్యత ప్రయోజనాలను సైతం అందిస్తుంది’’ అని అన్నారు.
బాక్ట్సర్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ రిషబ్ గుప్తా మాట్లాడుతూ ‘‘దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా దాని నిర్వహణ పట్ల తగిన శ్రద్ధ చూపే అవకాశాన్ని అంతర్జాతీయ మూత్రపిండాల దినోత్సవం తీసుకువచ్చింది. పీడీ చికిత్సకు బాక్ట్సర్ కట్టుబడి ఉంది. తద్వారా ఈఎస్కెడీ రోగుల జీవిత నాణ్యత మెరుగుపరుస్తుంది. పీడీని తొలి డయాలసిస్ చికిత్సగా మార్చాలన్నది మా ప్రయత్నం. తద్వారా రోగులు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధికి మెరుగైన చికిత్స పొందగలరు’’ అని అన్నారు.