Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎక్సాన్ మొబిల్ కొత్తగా పూర్తి సింథటిక్ ఇంజిన్ ఆయిల్ అయినా మొబిల్ 1 ట్రిపుల్ యాక్షన్ పవర్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ఇది ఇంధన పొదుపు అదనపు ప్రయోజనంతో పాటు అద్భుతమైన ఇంజిన్ పనితీరు, రక్షణ, పరిశుభ్రతను అందిస్తుందని ఆ కంపెనీ పేర్కొంది.
కారు యాజమానులకు వారి వాహనాల్లో శక్తిని అన్‌లాక్ చేయడంలో సాయపడేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిందని తెలిపింది. మొబిల్ 1 ఇంజిన్ ఆయిల్స్‌ని ప్రపంచంలో అత్యంత కఠినమైన, అత్యంత తీవ్రమైన ట్రాక్‌ల్లో పరీక్షించామని ఎక్సాన్ మొబైల్ లూబ్రికెంట్స్ సిఇఒ విపిన్ రాణా పేర్కొన్నారు.