Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్కినోస్ వెల్లడి
హైదరాబాద్ : దేశంలో సర్వికల్ క్యాన్సర్ ప్రమాద ఘంటికలు మోగు తున్నాయని ఆంకాలజీ టెక్నలాజీ వేదిక కార్కినోస్ హెల్త్‌కేర్ పేర్కొంది. ప్రతీ ఎనిమిది నిమిషాలకు ఓ మహిళ సర్వికల్ క్యాన్సర్ బారిన పడుతున్నా రని పలు నివేదికలు వెల్లడించాయని గుర్తు చేసింది. మూడు రోజుల పాటు సాగిన బిజినెస్ వుమెన్ ఎక్స్పో 2023లో కార్కినోస్ హెల్త్‌కేర్ కో ఫౌండర్ సుప్రియ రావ్ మాట్లాడుతూ.. మాతృమూర్తులతో పాటుగా కుమార్తెలను ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కార్కినోస్ నొక్కి చెప్పారు. అంతర్జాతీయంగా సర్వికల్ క్యాన్సర్ కేసుల మరణాల్లో నాలుగో వంతు భారత్‌లోనే చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రతీ ఏడాది 6 లక్షల కొత్త కేసులు నమోదు కాగా.. 3,41,831 మరణాలు సంభ విస్తున్నాయన్నారు. వ్యాధి తీవ్రతను ముందుగానే గుర్తించడం ద్వారా కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.