Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగం లోని యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాలపై 40 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును పెంచినట్లు పేర్కొంది. సాధారణ డిపాజిట ర్లు 7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధి గల ఎఫ్డీలపై ఇక నుంచి 3.50 శాతం కనిష్ఠ వడ్డీని పొందవచ్చని పేర్కొంది. 13 నెలల నుంచి 2 సంవత్సరాల ఎఫ్డీలపై 7.15 శాతం, 2 ఏండ్ల నుంచి 30 నెలల ఎఫ్డీలపై 7.26 శాతం వడ్డీ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సీనియర్ సిటిజన్లు గరిష్టంగా 8.01 శాతం వడ్డీ పొందే వీలుందని తెలిపింది.