Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : టాటా గ్రూపు నుంచి 18 ఏండ్ల తర్వాత ఓ కంపెనీ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)కు వస్తోంది. ఐపిఒ కోసం సెబీకి టాటా టెక్నలాజీస్ ప్రతి పాదన పత్రాలను సమర్పించిం ది. ఇందులోని టాటా మోటార్స్ సహా మరో ఇద్దరు ఇన్వెస్టర్లు 23.60 శాతం వాటాను విక్రయి ంచనున్నారు. దీనికి సమానమయ్యే 95,708,984 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఈ ఆఫర్లో భాగంగా టాటా మోటర్స్ లిమిటెడ్ 81,133,706 ఈక్విటీ షేర్లను, అల్ఫా టిసి హోల్డింగ్స్ పిటిఇ లిమిటెడ్ 9,716,853 ఈక్విటీ షేర్లను, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ సంస్థ 4,858,425 ఈక్విటీ షేర్లను విక్రయించనున్నాయి. ఈ కంపెనీలకు టాటా టెక్నాలజీస్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్‌లో వరుసగా 20 శాతం, 2.40శాతం, 1.20 శాతం చొప్పున వాటాలను అమ్మనున్నాయి. టాటా గ్రూపు చివరి సారిగా 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఐపిఒకు తెచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు టాటా టెక్నలాజీస్ ఇష్యూకు సిద్దం అయ్యింది.