Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐడీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు బంధన్ మ్యూచువల్ ఫండ్‌గా నూతన గుర్తింపును పొందింది. మార్చి 13, 2023 నుంచి ఈ గుర్తింపుతోనే అది కనిపించనుంది. తదనుగుణంగా ఈ ఫండ్ హౌస్ యొక్క ప్రతి పథకానికీ ఐడీఎఫ్సీ పదంకు బదులుగా బంధన్ పదం కనిపించనుంది. అయితే పెట్టుబడుల వ్యూహాలు, ప్రక్రియలు, బృందం మాత్రం అదే కొనసాగుతుంది. మదుపరులు, అదే తరహా అత్యున్నత నాణ్యత కలిగి పెట్టుబడుల విధానంతో ప్రయోజనం పొందగలరు.
బ్రాండ్ గుర్తింపు మార్పు గురించి ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ మాట్లాడుతూ తమ నూతన పేరు నూతన స్పాన్సర్‌షిప్‌ను ప్రతిబింబించడంతో పాటుగా బంధన్ గ్రూపులో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు. తమ స్పాన్సర్లు ప్రాతినిథ్యం వహిస్తున్న వారసత్వం, గుడ్‌విల్, అందరినీ కలుపుకుని పోవడం వంటి లక్షణాలతో మా మదుపరులు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నామన్నారు.
ఈ రీ బ్రాండింగ్‌తో పేరు, లోగో మారనుంది. బంధన్ మ్యూచువల్ ఫండ్ ఈ ఫండ్ హౌస్ ప్రయాణంలో నూతన అధ్యాయానికి ప్రతీకగా నిలువడంతో పాటుగా తమ వ్యాపారాలకు నూతన శక్తిని తీసుకురానుంది. సోమవారం నుంచి, మదుపరులు ఈ ఫండ్ హౌస్ యొక్క నూతన వెబ్సైట్ https://www.bandhanmutual.com ను చూడవచ్చు.