Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఒకరు తమ ఆర్ధిక ప్రణాళిక చేసుకుంటున్నప్పుడు, వారి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో టర్మ్ ఇన్సూరెన్స్ అత్యంత కీలకమైన అంశంగా నిలుస్తుంది. దీనికి కారణాలనేకం ముందుగా ఇది పాలసీ హోల్డర్ మరణించిన వేళ వారి ప్రియమైన వారికి ఆర్ధిక భద్రతను అందిస్తుంది. పాలసీ బజార్ డాట్ కామ్ టర్మ్ ఇన్సూరెన్స్ హెడ్ రిషబ్ గార్గ్ మాట్లాడుతూ ‘‘మీరు లేకపోయినప్పటికీ మీ ప్రియమైన వారి యోగక్షేమాలు చూసుకోబడతాయంటే అది మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఎవరికైనా మానసిక ప్రశాంతత అనేది అత్యంత ప్రధానమైన అంశం. అది ఇండియాలో ఉన్నా లేదంటే ఎన్ఆర్ఐలుగా విదేశాలలో ఉన్నప్పటికీ తప్పనిసరి. అనారోగ్యం, ప్రమాదం లేదా మరణం లాంటి ఊహాతీత సంఘటనలు జరిగినప్పుడు అది ఆర్ధిక భరోసాను అందించడంతో పాటుగా వారి కుటుంబ భవిష్యత్ పరంగా రాజీపడాల్సిన అవసరం తప్పిస్తుంది. ఆర్ధిక పరంగా చూస్తే భారతదేశం నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయంగా ఎన్ఆర్ఐలకు నిలుస్తుంది. భారతదేశంలో టర్మ్ఇన్సూరెన్స్ పాలసీలు తక్కువ ధరకు లభించడంతో పాటుగా విస్తృత స్ధాయి కవరేజీని అందిస్తుంది. అతి తక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావడం వల్ల ఎన్ఆర్ఐలు అత్యధిక మొత్తంలో జీవిత భీమా అందించే టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు.
మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఎన్ఆర్ఐలు ఉంటే, కొన్ని సంఘటనలలో ధరల వ్యత్యాసం 50 నుంచి 60% వరకూ ఉంటుంది. ఉదాహరణకు ఇండియాలో టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలుతో పోలిస్తే 40 నుంచి 50% అధికంగా సింగపూర్, యుఏఈ లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది. భారతీయ భీమా కంపెనీలు, భారతదేశంలోని తమ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తమ ఉత్పత్తులను రూపొందిస్తుంటాయి. నిజానికి ఎన్ఆర్ఐల కోసం కూడా భీమా కంపెనీలు ప్రత్యేకంగా ఉత్పత్తులను రూపొందించాయి. అవి ఎన్ఆర్ఐల నిర్ధిష్ట అవసరాలకు తగినట్లుగా ఉంటాయి. వాటిలో తీవ్ర అనారోగ్యం బారిన పడితే రక్షణ లేదా భారతదేశంలో నామినీలకు ప్రయోజనం అందించే రీతిలో ఉంటాయి.
భారతదేశం నుంచి భీమా కొనుగోలు చేయడం వల్ల ఎన్ఆర్ఐలకు పూర్తి ఆర్ధిక భద్రత లభ్యమవుతుంది. గతంలోలా భౌగోళిక హద్దులు వారికి అవరోధంగా నిలువడం లేదు. వారు అత్యంత సౌకర్యవంతంగా వీడియో లేదా టెలి మెడికల్ చెకప్ ను తమ నివాస దేశం నుంచి చేసుకోవచ్చు.