Authorization
Mon Jan 19, 2015 06:51 pm
~ రూ.10 లక్షల నుంచి అపరిమిత బీమా మొత్తంతో ప్లాటినం హెల్త్ ప్లాన్‌ను ప్రారంభించింది~
~ ఆరోగ్యం రానున్న కొన్నేళ్లలో ఆరోగ్య విభాగం అకో (ACKO)కు అతిపెద్ద కేటగిరీలలో ఒకటిగా మారనుంది.
నవతెలంగాణ - హైదరాబాద్
వినియోగదారుడిని దృష్టిలో ఉంచుకుని సరసమైన ధర, సౌలభ్యం మరియు అత్యుత్తమ వినియోగదారుని అనుభవాన్ని అందించే లక్ష్యంతో అకో (ACKO) ఇప్పుడు రిటెయిల్ ఆరోగ్య బీమా విభాగంలోకి అడుగుపెట్టింది. జీరో కమీషన్, జీరో పేపర్‌వర్క్, ఇన్స్టంట్ రెన్యూవల్, అదే రోజు క్లెయిమ్ సెటిల్మెంట్లు మరియు క్లెయిమ్‌లపై యాప్-ఆధారిత అప్డేట్లు వంటి ఫీచర్లతో, కస్టమర్లు బీమాను ఆస్వాదించే విధానంలో అకో (ACKO) ‘స్వాగతానికి అర్హమైన మార్పు’ తీసుకు వచ్చింది.
ఆరోగ్య బీమా విభాగంలోకి అకో (ACKO) ప్రవేశం ద్వారా పరిశ్రమలో మరింత ఆవిష్కరణ, పోటీని తీసుకువచ్చింది. చివరికి మరిన్ని ఎంపికలు, మెరుగైన సేవతో వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. కస్టమర్-సెంట్రిక్ విధానం, వ్యక్తిగతీకరించిన ఆఫరింగ్‌లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు డేటా ఇన్సైట్ల వినియోగంతో, అకో (ACKO) తన వినియోగదారుల అన్ని రక్షణ అవసరాలకు వన్-స్టాప్ గమ్యస్థానంగా ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారీగా ఉన్న ఆరోగ్య మార్కెట్లోకి ప్రవేశాన్ని, చొరబాటును వృద్ధి చేసేందుకు మరియు కొవిడ్ అనంతరం ఆరోగ్య బీమా కోసం పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు, అకో (ACKO) అత్యుత్తమ-శ్రేణి లక్షణాలతో ప్లాటినం హెల్త్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది:
భారతదేశంలో, మేము ఆరోగ్య బీమా, కవరేజ్ మొత్తంలో పూర్తిగా విస్తరించి ఉండలేదు. రెండింటినీ మెరుగుపరచేందుకు, మేము మా సూపర్ టాప్-అప్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులు ఇక్కడ తమ ప్రస్తుత బీమా మొత్తాన్ని రూ.10 లక్షల వరకు అపరిమితంగా తక్కువ ధరకు టాప్-అప్ చేసుకోవచ్చు. అకో (ACKO) ప్లాటినం హెల్త్ ప్లాన్ భారతదేశంలోని 7100 ప్లస్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌లో నగదు రహిత క్లెయిమ్‌లను అందిస్తుంది. సంవత్సరంలో ప్రతి రోజు 24X7 మద్దతును కూడా అందిస్తుంది.
ఆరోగ్య బీమా విషయంలో అకో (ACKO) విధానం మోటార్ ఇన్సూరెన్స్‌తో చేసిన దానితో సమానంగా ఉంటుంది. ఇక్కడ వారు మధ్యవర్తిత్వం వహించి పరిశ్రమలోని ప్రముఖ ఉత్పత్తులను వినియోగదారులకు ఉత్తమ ధరలకు అందిస్తూ, కేటగిరీ మరియు బ్రాండ్ అవగాహనను సృష్టించేందుకు బ్రాండ్‌లో పెట్టుబడి పెట్టారు. పరిశ్రమలో ప్రముఖ ఉత్పత్తులను, వాటి సాటిలేని విలువను వినియోగదారులకు నేరుగా అందించడం ద్వారా ఆరోగ్య విభాగంలోకి చొచ్చుకుని పోవాలని కంపెనీ యోచిస్తోంది.
రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి అకో (ACKO) ప్రవేశిస్తుందని అకో (ACKO) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ శ్రీనివాసన్ ప్రకటించి మాట్లాడుతూ, ‘‘ఆరోగ్య బీమా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. నానాటికీ పెరిగిపోతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు నివారణ ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెరగడం ఆరోగ్య బీమా ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. అయితే, ఆరోగ్య బీమా పరిశ్రమలో అతిపెద్ద సవాళ్లలో అందించే ఉత్పత్తులలో సంక్లిష్టత మరియు పారదర్శకత లేకపోవడం పెను సమస్యగా ఉంది. మా ఆరోగ్య ప్లాన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్న సమయంలో, మేము ఈ సమస్యలను ధీటుగా పరిష్కరిస్తూ, ఉత్తమమైన ఫీచర్లతో, అసమానమైన కొనుగోలు మరియు క్లయిమ్‌ల అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని తెలిపారు.
‘మా డైరెక్ట్-టు-కన్సూమర్ విధానం వినియోగదారులను ఒకప్పుడు అసాధ్యమని భావించిన సరసమైన మరియు వ్యక్తిగతీకరించిన ఎంపికలతో హెల్త్‌కేర్ కవరేజీని కొనుగోలు చేసేందుకు, నిర్వహించుకునేందుకు కొత్త మార్గాన్ని ఆస్వాదించేందుకు అనుమతిస్తుంది. కొత్త తరం వినియోగదారులు వ్యవహరించే తీరు, బీమాను ఆస్వాదించే విధానాలలో మార్పు తీసుకు రావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని ఆయన వివరించారు.
అకో (ACKO) ఇప్పటికే గత 2 రెండేళ్లుగా గ్రూప్ మెడికల్ కవర్లో తన ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌తో 800,000 కుటుంబ సభ్యులకు బీమా చేసింది. ఈ ప్రయత్నం అకో (ACKO) ఆరోగ్య బీమా ఉత్పత్తుల పట్ల కస్టమర్ల కష్టాలు మరియు అంచనాలను అర్థం చేసుకోవడంలో సహాయపడింది. ఇది కంపెనీ రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌గా విస్తరించేందుకు అవకాశాన్ని కల్పించింది.