Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రభుత్వ రంగం లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బిఒఎం) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇంటి రుణాలపై 8.6 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.4 శాతానికి కోత పెట్టినట్లు పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లు మార్చి 13 నుంచి అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. బ్యాంకింగ్ పరిశ్రమలోనే ఈ వడ్డీ రేటు తక్కువని బిఒఎం పేర్కొంది. రక్షణ రంగంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు మరింత ఆకర్షణీయ వడ్డీ రేట్లతో గృహ రుణాలు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజును కూడా రద్దు చేసినట్లు తెలిపింది.