Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సురక్షిత షాపింగ్ పద్ధతులపై అవగాహన కల్పించడం, ఆన్లైన్లో వంచకుల నుంచి వినియోగదారులను రక్షించడం ద్వారా వారి భద్రతను మెరుగుపరచడమే ఈ పరస్పర ఒప్పందం లక్ష్యం.
- ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లలో ఆన్లైన్ వినియోగదారులను రక్షించేందుకు, ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లను మరింత సురక్షితమైనదిగా చేసేందుకు అదనపు పరిష్కారాలను కనుగొనేందుకు, ఒత్తిడి సమస్యలను గుర్తించేందుకు ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు మరియు సంయుక్త పరిశోధనలు ఇందులో భాగంగా ఉంటాయి.
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (IIPA) మరియు అమెజాన్ ఇండియా నేడు పలు సంయుక్త కార్యక్రమాలకు సహకారాన్ని అందించుకునేందుకు అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసుకున్నాయి. ఈ ఒప్పందాల ద్వారా వినియోగదారులకు ఆన్లైన్లో ఎక్కువ నమ్మకంతో షాపింగ్ చేసేందుకు సాధికారత దక్కుతుంది.
ఆన్లైన్ వినియోగదారులు తమ హక్కుల పట్ల అవగాహనను మెరుగుపరచడంతో పాటు సురక్షితమైన షాపింగ్ పద్ధతులపై అవగాహన పెంచేందుకు, వంచకుల నుంచి ఆన్లైన్ షాపర్లను రక్షించే దిశలో సహకారాన్ని అందించేందుకు అంగీకరించుకుని, ఈ రెండు సంస్థలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి. “అమెజాన్ సెంటర్ ఆఫ్ కన్సూమర్ స్టడీస్ తరపున ఐఐపిఏ (IIPA)తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉంది. సురక్షితమైన షాపింగ్ వాతావరణాన్ని సృష్టించడం అనేది మా మార్కెట్‌ప్లేస్‌లో వినియోగదారుని నమ్మకాన్ని గెలుచుకుని, దాన్ని నిలుపుకోవడం చాలా కీలకమైన అంశం. ఈ దిశలో పురోగమించడానికి ఐఐపిఏ వంటి సారూప్య సంస్థలతో సహకారం చాలా కీలకమని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. ఆన్లైన్ షాపర్లకు ఒక సురక్షితమైన, నమ్మదగిన అనుభవాన్ని అందించేందుకు అమెజాన్‌కే కాకుండా మొత్తం ఇ-కామర్స్ పరిశ్రమకు ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి అవుతుందని మేము ఆశిస్తున్నాము’’ అని అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ ఉపాధ్యక్షుడు చేతన్ కృష్ణస్వామి పేర్కొన్నారు.
“అమెజాన్‌తో ఐఐపిఏ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. దీని విస్తృత ప్రపంచ అనుభవాలు సురక్షితమైన ఇ-కామర్స్ స్పేస్ కోసం కొత్త టైలర్-మేడ్ సొల్యూషన్ల అభివృద్ధికి సహకరించేందుకు భారతీయ వినియోగదారులపై మా లోతైన అవగాహనకు అద్దం పడతాయి. మా సహకారం అమెజాన్‌కు ఉన్న విస్తారమైన ప్రపంచ అనుభవంతో పాటు భారతీయ వినియోగదారులపై ఐఐపీఏ లోతైన అవగాహన నుంచి ప్రయోజనం పొందనుంది. భారతీయ ఆన్లైన్ దుకాణదారుల ఆందోళనలను పరిష్కరించేందుకు, మా సంయుక్త బలాలు కొత్త టైలర్-మేడ్ సొల్యూషన్ల అభివృద్ధికి సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము’’ అని ఐఐపిఏ డైరెక్టర్ జనరల్ ఎన్.ఎన్. త్రిపాఠి ధీమా వ్యక్తం చేశారు.
ఒప్పందలో భాగంగా, ఆన్లైన్ షాపర్లకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు మరియు వారి భద్రతకు ప్రాధాన్యతనిచ్చేలా వారికి సాధికారత కల్పించేందుకు వినియోగదారులకు అవగాహన ప్రచారంతో పాటు పలు సంయుక్త ప్రాజెక్టులను అన్వేషించేందుకు ఐఐపీఏ మరియు అమెజాన్ అంగీకరించాయి; ఆన్లైన్ వినియోగదారుల భద్రతపై ప్రభావం చూపే సమస్యలను గుర్తించేందుకు మరియు దాన్ని పరిష్కరించేందుకు క్రియాత్మక పరిష్కారాలను కనుగొనేందుకు వివిధ రకాల వాటాదారుల ప్రాతినిధ్యంతో పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు, అమెజాన్ ఉత్తమ పద్ధతుల అవలోకనం మరియు ఆన్లైన్ స్కామ్‌ల నివారణకు ఉత్తమ అభ్యాసాలపై అవగాహన కల్పించేందుకు అట్టడుగు వినియోగదారుల సమూహాలకు అనేక శిక్షణా కార్యక్రమాలు, వినియోగదారుల విశ్వాసానికి సంబంధించిన అంశాలపై దృష్టి సారించేందుకు సంయుక్తంగా పరిశోధన చేయనున్నారు.
అమెజాన్ అధునాతన మెషీన్ లెర్నింగ్ సామర్థ్యాలు, నిపుణులైన మానవ పరిశోధకుల కలయికతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంచకుల నుంచి తన వినియోగదారులను రక్షించేందుకు సహకరిస్తుంది. అమెజాన్ 2021లోనే 0 మిలియన్లకు పైగా పెట్టుబడి పెట్టింది మరియు మెషిన్ లెర్నింగ్ శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ డెవలపర్లు మరియు నిపుణులైన పరిశోధకులతో సహా 12,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. తమ వినియోగదారులు, బ్రాండ్లు, విక్రయ భాగస్వాములు మరియు మార్కెట్‌ను నకిలీ, మోసం, వంచన, దుర్వినియోగం చేసే వారి నుంచి రక్షించేందుకు అంకితభావాన్ని కలిగి ఉన్నారు.
అదనంగా, ఐఐపిఏ మరియు అమెజాన్ విభిన్న వాటాదారుల కోసం అనేక సంయుక్త జ్ఞాన-భాగస్వామ్య సెషన్లు మరియు వెబ్నార్లను నిర్వహించనున్నాయి. వినూత్నమైన వీధి నాటకాల ద్వారా ఆన్లైన్లో నిమగ్నమవ్వడం ద్వారా సురక్షితమైన ఆన్లైన్ షాపింగ్ ప్రవర్తన, వినియోగదారుల హక్కులు మరియు మరిన్నింటి గురించి అవగాహనను వ్యాప్తి చేసే అమెజాన్ ఇండియా ఇటీవల ప్రకటించిన వినియోగదారు-విద్యా చొరవ, ‘మిషన్ గ్రాహాక్’కు (Mission GraHAQ) అనుగుణంగా ఈ అవగాహన ఒప్పందం ఉంది.
ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఐఐపిఏ అనేది ప్రభుత్వ పాలన, విధానాలు, అమలుపై ఆలోచన మరియు ప్రభావం చూపే ప్రముఖ విద్యా కేంద్రం. గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి, జగదీప్ ధన్కర్ ఐఐపిఏ అధ్యక్షునిగా ఉండగా, భారత ప్రభుత్వ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ మంత్రిత్వ శాఖకు బాధ్యత వహిస్తున్న కేంద్ర సహాయ మంత్రి డా.జితేంద్ర సింగ్ ఐఐపిఏకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఐఐపిఏ యూనిట్, సెంటర్ ఫర్ కన్సూమర్ స్టడీస్ (CCS), వినియోగదారుల రక్షణలో నిమగ్నమైన ప్రభుత్వ/ప్రభుత్వేతర ఎగ్జిక్యూటివ్‌లకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు క్రమ శిక్షణల ద్వారా వినియోగదారుల విద్య/అవగాహన ప్రచారాల ద్వారా వినియోగదారుల హక్కులను రక్షించేందుకు మరియు ప్రోత్సహించేందుకు అంకితమై ఉంది.
అమెజాన్‌లో సేఫ్ షాపింగ్ గురించి మరింత సమాచారం కోసం, దయచేసి ఇక్కడ సందర్శించండి:
https://www.aboutamazon.in/news/retail/safe-shopping-on-amazon-heres-what-you-need-to-know
అమెజాన్. ఇన్ గురించి అమెజాన్. ఇన్ మార్కెట్‌ను అమెజాన్. కామ్, ఇంక్‌ను (NASDAQ: AMZN) అనుబంధ సంస్థ అయిన అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తోంది. అమెజాన్.ఇన్ వినియోగదారులకు ఆన్లైన్లో కొనుగోలు చేయాలనుకుంటున్న దేనినైనా కనుగొని, కనుగొనగలిగేలా అత్యంత కస్టమర్-సెంట్రిక్ ఆన్లైన్ డెస్టినేషన్‌ను రూపొందించేందుకు ప్రయత్నిస్తుంది - విస్తారమైన ఎంపిక, పోటీ ధరలు, వేగవంతమైన మరియు విశ్వసనీయమైన డెలివరీ, విశ్వసనీయమైన, అనుకూలమైన అనుభవం; మరియు అమ్మకందారులకు ప్రపంచ స్థాయి ఇ-కామర్స్ మార్కెట్‌ను అందిస్తుంది.
మరింత సమాచారం కోసం, www.amazon.in/aboutus ని సందర్శించండి.
అమెజాన్ వార్తల కోసం, www.twitter.com/AmazonNews_IN ని అనుసరించండి.