Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేటింగ్‌ను తగ్గించే అవకాశం
వాషింగ్టన్ : అమెరికాలో వారం రోజుల్లో మూడు బ్యాంక్ లు మూత పడటంతో ఇంటర్నే షనల్ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ మిగితా బ్యాంక్‌ల పరపతిపై దృష్టి పెట్టింది. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ సహా మరో ఐదు విత్త సంస్థల పరపతిని సమీక్షించనున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ వెల్లడించింది. వెస్టర్న్ అలయన్స్ బాన్‌కార్ప్, ఇంట్రస్ట్ ఫైనాన్సీయల్ కార్ప్, యుఎంబి ఫైనాన్సీయల్ కార్ప్, జియాన్స్ బాన్‌కార్ప్, కొమెరికా ఐఎన్సి విత్త సంస్థల రేటింగ్‌ను సమీక్షిస్తోంది. సిల్వర్ గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్విబి), సిగేచర్ బ్యాంక్‌లు దివాళా తీయడంతో మిగితా రుణ సంస్థల ఆస్తులు, నష్టాలను అంచనా వేయాలని భావిస్తోంది. ఎస్విబి బ్యాంక్ డిపాజిటర్లకు అమెరికన్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అక్కడి ఇతర బ్యాంక్‌ల షేర్లు నష్టాలను చవి చూస్తున్నాయి. సోమవారం సెషన్లో శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేస్తోన్న ఫస్ట్ రిపబ్లిక్ షేర్ 62 శాతం పడిపోయింది. ఫోనిక్స్ కేంద్రంగా ఉన్న వెస్టర్న్ అలయన్స్ 47 శాతం, డల్లాస్ కేంద్రంగా పని చేసే కొమెరికా షేర్ 28 శాతం చొప్పున నష్టపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మూడీస్ ఆయా బ్యాంక్‌ల పరపతిని సమీక్షించాలని యోచిస్తోంది.