Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరో 10,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. నాలుగు నెలల క్రితం 11వేల మంది సిబ్బందికి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఈ సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 13 శాతానికి సమానం. తాజాగా రెండో రౌండ్లోనూ 10వేల మందిని తొలగించాలని నిర్ణయించామని.. అదే విధంగా కొత్తగా 5వేల మందిని భర్తీ చేయాలనుకున్న నిర్ణయాన్ని నిలిపివేస్తామని మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) మార్క్ జూకర్బర్గ్ తెలిపారు. తమ ఆర్థిక పరపతిని పెంచుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. దీర్ఘకాల లక్ష్యంలో భాగంగా ఉద్వాసనలు జరుగుతున్నాయన్నారు. తొలగింపులు తప్పా సంస్థకు మరో మార్గం లేదన్నారు. టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ట్విట్టర్ సగం మంది ఉద్యోగులను తొలగించగా... తాజాగా మెటా, సేల్స్ఫోర్స్ల్లోని వేల మంది సిబ్బందికి ఆ కంపెనీలు ఉద్వాసన పలుకుతున్నాయి. 2004లో ఫేస్బుక్ ప్రారంభమైన తర్వాత వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి. ప్రకటనల ఆదాయం తగ్గుముఖం పట్టడం, అమెరికా సహా ప్రపంచ దేశాల్లో నెలకొన్న మాంద్యం భయాల నేపథ్యంలో మెటా కోతలకు దిగుతోంది. ఈ గ్రూపు పరిధిలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి దిగ్గజ సోషల్ మీడియా వేదికలు ఉన్నాయి. 2022 నుంచి టెక్ పరిశ్రమలో 2,80,000 ఉద్యోగాలు ఊడయని పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఇందులో 40 శాతం ఉద్వాసనలు ఈ ఏడాదిలోనే జరిగాయి.