Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంజినీరింగ్ కాలేజీల్లో తనిఖీలు చేపట్టాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలతో కూడిన పత్రాలను కాలేజీలు పొందుపరచడం లేదంటూ ఏఐసీటీఈ స్పష్టంగా ప్రకటించిందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం (2023-24)లో వాటిని తప్పనిసరిగా ఏఐసీటీఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కోరిందని పేర్కొన్నారు. అలా చేసిన కాలేజీల వివరాలనే పరిశీలిస్తామని ప్రకటించిందని తెలిపారు. వాస్తవానికి కొన్నేండ్లుగా సరైన పత్రాలు లేకుండా ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నిం చారు. ప్రత్యక్ష తనిఖీలు చేయకుండా, కనీసం కొత్త కోర్సుల అనుమతుల సమయంలో కూడా తనిఖీలు చేయకుండా అనుమతులిచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ఏఐసీటీఈ అధికారులు స్పందించి పారదర్శకంగా తగిన విచారణ, తనిఖీలు చేపట్టాలని కోరారు.