Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో నెంబర్ 1 స్మార్ట్ టీవీ బ్రాండ్ షావోమీ ఇండియా వినియోగదారుల కోసం స్మార్ట్ టీవీ వీక్షణ అనుభవాలను పునరావిష్కరించడమే లక్ష్యంగా Redmi Smart Fire TV విడుదల చేసింది. సౌకర్యవంతమైన స్ట్రీమింగ్ అనుభవాలను అందించే రీతిలో అంతర్గతంగా నిర్మించిన ఫైర్ టీవీ తో రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ వైవిధ్యమైన పిక్చర్ ఇంజిన్ , డాల్బీ ఆడియోను తమ శ్రేణిలో అత్యుత్తమ వినోద అనుభవాలను అందించేందుకు తీర్చిదిద్దబడింది. హై డెఫినేషన్ రెడీ (హెచ్డీ–రెడీ) డిస్ప్లేను అందించే రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీలో అత్యంత శక్తివంతమైన 20 వాట్ స్పీకర్లు, డాల్బీ ఆడియో, DTS-HD మరియు DTS: Virtual X technology ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Amazon Alexa తో Redmi Voice Remote తో వస్తుంది. అందువల్ల వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా ఛానెల్స్ మధ్య మారడం, యాప్‌లను త్వరగా ప్రారంభించడం, టైటిల్స్ వెదకడం, సంగీతం ప్లే చేయడం మరియు స్మార్ట్ హోమ్ ఉపకరణాలను తమ గొంతుతో నియంత్రించడం చేయవచ్చు. Xiaomi India వద్ద డిప్యూటీ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ గా సేవలనందిస్తున్న సుదీప్ సాహూ మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరి కోసం ఆవిష్కరణ’ అనే మా వాగ్ధానానికి కట్టుబడి, Xiaomi India వద్ద మేము స్ధిరంగా వినియోగారుల స్మార్ట్ టీవీ వీక్షణ అనుభవాలను పునరావిష్కరించడానికి కట్టుబడి ఉన్నాము. అమెజాన్‌తో ఈ భాగస్వామ్యంతో, మేము మా వారసత్వం మరింత ముందుకు తీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ అత్యుత్తమ శ్రేణి డిస్ప్లే, సౌండ్ పెర్ఫార్మెన్స్ మరియు అంతర్గతంగా ఉన్న Fire TV తో Redmi Smart Fire TV ఖచ్చితంగా వినియోగదారుల వీక్షణ అనుభవాలను మెరుగుపరచనుంది’’ అని అన్నారు. ఆయనే మాట్లాడతూ ‘‘ మా పోర్ట్‌ఫోలియోలో ఈ తాజా జోడింపుతో , మా వినియోగదారులకు అత్యత్తమ హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌ను అందించడంతో పాటుగా అత్యున్నత నాణ్యత , ఆవిష్కరణ అందుబాటుధరల్లోని స్మార్ట్ టీవీ అనుభవాలను, తమ మునివేళ్ల పై ఎంపిక అవకాశాలతో అందిస్తున్నాము’’ అని అన్నారు.
Fire TV & Kindle, Amazon India జనరల్ మేనేజర్ అనీష్ ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ ‘‘ రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ అత్యున్నత వీక్షణ అనుభవాలను అందిస్తుంది. దీనిని Alexa తో నియంత్రించవచ్చు. తద్వారా గృహ వినోద అనుభవాలు మరింతగా మెరుగవుతాయి. ఈ టీవీ ద్వారా తమ ఇళ్లలో అత్యుత్తమ కంటెంట్ అనుభవాలను వినియోగదారులు పొందగలరు’’ అని అన్నారు. Redmi Smart Fire TV 32" ధర 13,999 రూపాయలు. ఇది Mi.com మరియు Amazon.in.పై లభ్యమవుతుంది. పరిమిత కాలం పాటు వినియోగదారులు ఈ యూనిట్‌ను పరిచయ ధర 11,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.