Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మైలాన్ లేబరేటరీస్ లిమిటెడ్ (వియాట్రిస్ కంపెనీ) గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇన్స్టిట్యూట్ ఇండియా ద్వారా వరుసగా రెండవ సంవత్సరం భారతదేశంలో గ్రేట్ ప్లేస్ టు వర్క్® గా గుర్తించబడింది. ఉద్యోగులు తాము విలువైన వారిగా భావించబడి, సహాయ సహకారాలు పొంది, తమ అభిప్రాయాలు, విచారాలు గురించి యాజమాన్యం శ్రద్ధ వహిస్తుందని భావించబడే సమీకృత పని వాతావరణం నిమగ్నం చేయడాన్ని ప్రోత్సహించడానికి ఈ ధృవీకరణ వియాట్రిస్ వారి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. సానుకూలమైన పని ప్రదేశం సంస్క్రతిని కల్పించడంలో, ఉద్యోగి సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో మరియు కెరీర్ అభివృద్ధి అవకాశాలను కేటాయించడంలో వియాట్రిస్ ప్రయత్నాలకు ఈ విజయం ఒక సాక్ష్యం. గ్రేట్ ప్లేస్ టు వర్క్® అనేది పని చేసే ప్రదేశంలోని సంస్క్రతి పై ఒక అంతర్జాతీయ సంస్థ. 1992 నుండి, ఇది ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్లకు పైగా ఉద్యోగులను సర్వే చేసింది మరియు ఒక గొప్ప పని చేసే ప్రదేశంగా ఏది చేస్తుందో నిర్వచించడానికి ఆ విస్త్రతమైన అంశాలను ఉపయోగించింది: నమ్మకం. భారతదేశంలో, సంస్థ సుస్థిరమైన వ్యాపార ఫలితాలను అంద చేయడానికి సంస్క్రతులు రూపొందించబడేలా సహాయ పడటానికి 22 పరిశ్రమలలో ఏటా 1,400 సంస్థలకు పైగా సంస్థలతో భాగస్వామం చెందింది. వియాట్రిస్ ను అయిదు శ్రేణులలో - నమ్మకం, గౌరవం, న్యాయం, గర్వం మరియు సహకారంలో అంచనా వేసిన గ్రేట్ ప్లేస్ టు వర్క్® ట్రస్ట్ ఇండెక్స్© ఎంప్లాయీ సర్వే ప్రకారం - వియాట్రిస్ ఇండియా సంస్థ పని చేయడానికి ఒక గొప్ప ప్రదేశంగా 80%కి పైగా జవాబు ఇచ్చిన వారు తమ అభిప్రాయం తెలియచేసారు. ధృవీకరణ పై వ్యాఖ్యానిస్తూ, ఉద్భవ్ గంజూ, హెచ్ఆర్ ప్రధాన అధికారి - గ్లోబల్ ఆపరేషన్స్ ఇండియా ఎమర్జింగ్ ఏషియా & యాక్సెస్ మార్కెట్స్ ఇలా అన్నారు, "వరుసగా రెండవ సంవత్సరం గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ అందుకోవడానికి మేము ఆనందిస్తున్నాము. సానుకూలమైన మరియు సమీకృతమైన పని సంస్క్రతిని రూపొందించడంలో మా నిరంతర ప్రయత్నాలకు గుర్తింపు ఒక సాక్ష్యం మరియు జీవితంలోని ప్రతి దశలో ఆరోగ్యంగా జీవించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సాధికారత కలిగించే మా మిషన్ కు మద్దతు ఇవ్వడంలో మెరుగు పరచడానికి మరియు నవీకరించడాన్ని కొనసాగించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది. మా విజయాన్ని ప్రోత్సహించే మేము మా ఉద్యోగులు పట్ల ఎంతో కృతజ్ఞత చూపిస్తాం, వారి కోసం ఒక విజయవంతమైన మరియు నిమగ్నమయ్యే పని వాతావరణం కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాం."
వియాట్రిస్ గురించి
వియాట్రిస్ ఇన్కా. (ఎన్ఏఎస్డీఏక్యూ: వీటీఆర్ఎస్) ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కంపెనీ, జీవితంలోని ప్రతి దశలో ఆరోగ్యంగా జీవించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సాధికారత కలిగిస్తోంది. మా విలక్షణమైన గ్లోబల్ హెల్త్‌కేర్ గేట్‌వే® ద్వారా
మేము మందులు, ఆధునికమైన సుస్థిరమైన కార్యకలాపాలు అందుబాటులో ఉండేలా కేటాయిస్తాము, ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ ఉత్పత్తులకు మరియు సేవలకు కనక్ట్ అవడానికి కొత్త పరిష్కారాలు అభివృద్ధి చేస్తాము, మా ఉమ్మడి నైపుణ్యాన్ని ఉపయోగిస్తాము.
నవంబర్ 2020లో రూపొందించబడిన వియాట్రిస్ 165కి పైగా దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో రోగులకు ఉన్నతమైన నాణ్యత గల మందుల్ని అందించడానికి నిరూపించబడిన నియంత్రణ, వైద్యపరమైన మరియు వాణిజ్య సామర్థ్యాలతో శాస్త్రీయమైన, తయారీ
మరియు పంపిణీ నైపుణ్యాన్ని ఒక చోటకు తెచ్చింది. వియాట్రిస్ పోర్ట్‌ఫోలియో విస్త్రతమైన చికిత్సాపరమైన విభాగాలలో 1,400కి పైగా ఆమోదించబడిన అణువుల్ని కలిగి ఉంది. అంతర్జాతీయంగా గుర్తించబడిన బ్రాండ్స్, సంక్లిష్టమైన సాధారణ (జనరిక్) మరియు
బ్రాండెడ్ ఔషధాలు సహా సంక్రమించని మరియు సంక్రమించే వ్యాధులు రెండిటిలో విస్తరించింది. బయోసిమిలార్స్ మరియు ఓవర్ ది కౌంటర్ వినియోగదారు ఉత్పత్తుల రకాల పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంది. సుమారు 37,000 మంది అంతర్జాతీయ సిబ్బందితో, వియాట్రిస్ యు.ఎస్.లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది, పిట్స్బర్గ్, షాంఘై మరియు భారతదేశంలో
హైదరాబాద్‌లలో అంతర్జాతీయ కేంద్రాల్ని కలిగి ఉంది. viatris.com మరియు investor.viatris.com పై మరింత తెలుసుకోండి, ట్విట్టర్ లో @ViatrisInc, LinkedIn పై మరియు YouTube పై మాతో కనక్ట్ అవండి.