Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్లాక్బెర్రీ లిమిటెడ్ కొత్తగా హైదరాబాద్లో తన ఐఒటి సెంటర్ ఆఫ్ ఎక్స లెన్సీ, ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కెనడా తరువాత అంతర్జాతీయంగా బ్లాక్బెర్రీ ఐఒటి డివిజన్లలో రెండవ అతిపెద్ద కేంద్రంగా ఇది నిలువనుందని తెలిపింది. ఇక్కడ 100మంది సాఫ్ట్వేర్ ఇంజినీరులు పని చేయనున్నారని పేర్కొంది. ఈ ప్రపంచ శ్రేణీ ఇంజినీరింగ్ కేంద్రం, భారతదేశపు అత్యుత్తమ ఎంబీడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను నియమించుకోవడం ద్వారా భావితరపు వాహన సాఫ్ట్వేర్ వేదిక (ఎస్డివిలు) నిర్మించడంలో సహాయపడనున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరిశ్రమలలో అత్యాధునిక ఆవిష్కర ణలకు చేపట్టనున్నట్లు తెలిపింది. మార్చి 29న బెంగళూరులో జరగనున్న వార్షిక టెక్ ఫోరమ్ ఇండియాకు ముందుగా తమ తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తగిన ప్రణాళికలను వెల్లడించనున్నట్లు బ్లాక్బెర్రీ ఐఒటి ప్రెసిడెంట్ మత్తియాస్ ఎరిక్సన్ పేర్కొన్నారు.