Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్‌కు 344 పాయింట్ల నష్టం
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజూ నష్టాలు చవి చూశాయి. బుధవారం సెషన్లోనూ అమ్మకాల పరంపర కొనసాగింది. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలకు తోడు దేశీయంగా ఎలాంటి సానుకూల అంశాలు కానరావడం లేదు. ఈ పరిణామాలతో బిఎస్ఇ సెన్సెక్స్ 344 పాయింట్లు కోల్పోయి 57,556కు దిగజారింది. ఐదు సెషన్లలో ఈ సూచీ 2,792 పాయింట్లు నష్టపోయింది. దీంతో మదుపర్ల సంపద దాదాపుగా రూ.8 లక్షల కోట్లు పైగా ఆవిరయ్యింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 71 పాయింట్లు తగ్గి 16,972 వద్ద ముగిసింది. నిఫ్టీ 50లో భారతీ ఎయిర్టెల్, ఇండుస్‌ఇండ్ బ్యాంక్ సూచీలు అధికంగా 2 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. రిలయన్స్ 1.7 శాతం నష్టపోగా, ఎస్బిఐ, హెచ్‌యుఎల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, నెస్ట్లే, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1 శాతం చొప్పున తగ్గాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్సీయల్, టెలికాం స్టాక్స్ ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.