Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్న వారి కోసం ఎంఎస్ఎన్ గ్రూపు బయోఈక్వలెంట్ జనరిక్ వెర్షన్ అయిన ఫెసొబిగ్ను ఆవిష్కరించింది. బుధవారం దీన్ని హైదరాబాద్‌లో ఆ కంపెనీ ఎగ్జి క్యూటివ్ డైరెక్టర్ భరత్ రెడ్డి విడుదల చేశారు. ఓవరాక్టివ్ బ్లాడర్ (ఒఎబి), యూరినరీ ఇన్‌కాంటినెన్స్ చికిత్స కోసం వివిధ అంతర్జాతీయ చికిత్స మార్గదర్శకాల ద్వారా అత్యంత సురక్షిత, వినూత్నత ఫస్ట్ లైన్ ఫార్మా కోథెరపీ ఎంపికగా ఈ ఔషధం సిఫారసు చేయబడిందని భరత్ రెడ్డి తెలిపారు. ''ఫెసొబింగ్ టాబ్లెట్ల ఆవిష్కారం భారతీయ రోగుల బాధలను తగ్గించడానికి క్లిష్టమైన చికిత్సలలో సరసమైన మందులను తీసుకు రావడానికి పరిశోధన చేయడానికి మా కొనసాగుతున్న నిబద్ధతకు అను గుణంగా ఉంది'' అని భరత్ రెడ్డి పేర్కొన్నారు.