Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్ 70 శాతం పతనం
వాషింగ్టన్ : అమెరికన్ బ్యాంక్‌ల సంక్షోభం ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. తాజాగా మరో బ్యాంక్ మూత పడనుందని రిపోర్టులు వస్తున్నాయి. తాజాగా రిపబ్లిక్ బ్యాంక్ షేర్ 70 శాతం పతనంతో మూతవేత దిశగా పయనిస్తోందని సమాచారం. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌తో పాటు మరో ఐదు బ్యాంకింగ్ సంస్థల పరపతిని సమీక్షిస్తున్నామని ఆదివారం మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ పేర్కొంది. దీంతో సోమవారం ఆ బ్యాంక్ షేర్ ఏకంగా 70 శాతం పడిపోయింది. ఫెడరల్ రిజర్వ్, జెపి మోర్గాన్ చేజ్ అండ్ కోతో సహా ఒప్పందాల కార్యకలాపాల ద్వారా నిర్వహణ కోసం 70 బిలియన్ డాలర్లకుపైగా నగదు నిల్వలు ఉన్నాయని ఆ బ్యాంక్ ప్రకటించినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. సిలికాన్ బ్యాంక్, సిగేచర్ బ్యాంక్‌ల మూత తర్వాత అమెరికా సహా యూరప్ మార్కెట్లలో పెద్ద బ్యాంక్‌ల షేర్లు వేగంగా పడిపోతున్నాయి. గత వారంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్ 74.25 శాతం పడిపోయింది. గడిచిన పది రోజుల్లోనే సిల్వర్ గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్విబి), సిగేచర్ బ్యాంక్‌లు దివాళా తీసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ఆందోళనలు, భయాలు వ్యక్తం అవుతోన్నాయి.