Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలో ప్రముఖ ఆన్లైన్ మెడికల్ ప్రిపరేషన్ ప్లాట్‌ఫామ్ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది ప్రెప్ ల్యాడర్. ప్రెప్ ల్యాడర్ ప్లాట్ ఫామ్ ద్వారా ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులు తమ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఇంకా సాధిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ముగిసిన నీట్ పీజీ పరీక్ష 2023 ఫలితాల్లోనూ ప్రెప్ ల్యాడర్ ద్వారా సబ్జెక్టు నేర్చుకున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఆలిండియా టాప్ 10 ర్యాంకుల్లో 8 మంది అభ్యర్థులు ప్రెప్ ల్యాడర్ ద్వారా నేర్చుకున్నవారే. ఈ టాప్ 8 ర్యాంక్ హోల్డర్లలో ఆలిండియా ర్యాంక్ 1, 2, 3, 4, 5, 6, 7, మరియు 10 ఉన్నాయి. ఎమ్.బి.బి.ఎస్ పూర్తి చేసి దేశంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించడానికి జాతీయ స్థాయి అర్హత మరియు ర్యాంకింగ్ పరీక్షలను ఎన్.బి.ఈ. (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) నిర్వహిస్తుంది. ఎన్.బి.ఈ ప్రకటించిన ఫలితాల్లో 8 మంది ప్రెప్ ల్యాడర్ అభ్యర్థులు ఆలిండియా టాప్ ర్యాంకుల్లో 10 ర్యాంకుల్ని సాధించారు. అంతేకాకుండా 700కి పైగా మార్కులు తెచ్చుకున్నారు. మరోవైపు, అభ్యర్థుల మధ్య విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ, 30 మందికి పైగా విద్యార్థులు ఆలిండియా 100 ర్యాంకుల్లో ఎక్కువ ర్యాంక్‌లు సాధించారు. ప్రెప్ ల్యాడర్ ద్వారా అభ్యసించి అద్భుతమైన ర్యాంకులు సాధించిన వారిని ఒకసారి చూస్తే.. జైపూర్‌కు చెందిన డాక్టర్ ఆరుషి నర్వానీ (AIR 1 ) 725 మార్కులు సాధించారు. ఆ తర్వాత, వడోదర నుంచి డాక్టర్ ప్రేమ్ తిలక్ పళని (AIR 2) చర్కీ దాద్రి నుంచి డాక్టర్ రూపేష్ థోలియా (AIR 3) 721 మార్కుల్ని సాధించారు. అలాగే వడోదరకు చెందిన డాక్టర్ ఆకాష్ సేథి (AIR 4) 718 మార్కులు, ముంబైకి చెందిన డాక్టర్ మచావే అమేయ ప్రసాద్ (AIR 5) 717 మార్కులు, లాడ్వా నుండి డాక్టర్ కేశవ్ గార్గ్ (AIR 6) 716 మార్కులు, డాక్టర్ సాగర్ లాంబా ( ఢిల్లీ నుండి AIR 10) 711 మార్కులు సాధించారు.
నీట్ పీజీ పరీక్ష 2023 ఫలితాల ద్వారా ప్రెప్ ల్యాడర్ సాధించిన విజయాల్లో ముఖ్యంశాలు:
ఆలిండియా టాప్ 5 ర్యాంకులు ప్రెప్ ల్యాడర్ వారివే
ఆలిండియా టాప్ 10 ర్యాంకుల్లో 8 మంది అభ్యర్థులు ప్రెప్ ల్యాడర్ కు చెందినవారే. అందరూ 700కి పైగా మార్కులు సాధించిన వారే.
ఆలిండియా 100 ర్యాంకుల్లోపు 30 మందికి పైగా అభ్యర్థులు ప్రెప్ ల్యాడర్ కు చెందినవారే.
ప్రెప్ ల్యాడర్ వైద్య విద్యార్థులకు వారి పీజీ పరీక్షల్లో విజయాలు నమోదు చేసేందుకు వారికి దేశంలోనే అత్యుతమమైన మెటీరియల్ ను అందిస్తుంది. దేశంలోని అగ్రశ్రేణి వైద్య అధ్యాపకులు ఆన్లైన్ వీడియో ఉపన్యాసాలు అందిస్తారు. అంతేకాకుండా స్వీయ-వివరణాత్మక డిజిటల్ నోట్లు, 70 శాతం క్లినికల్ ఆధారిత ప్రశ్నల ద్వారా అధిక మార్కులను అందించే క్వశ్చన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. వీటితోపాటు కఠినమైన ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ లాంటివి ప్రెప్ ల్యాడర్ విద్యార్థులకు విస్తృతంగా అందిస్తున్నారు. వీటి ద్వారా విద్యార్థులు ఎక్కువ ఫలితాలను పొందుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ కంటెంట్ నుంచి దాదాపు 96 శాతం మ్యాచ్ అవుతుందంటే పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రెప్ ల్యాడర్ విద్యార్థులు సాధిస్తున్న అసాధారణమైన ఫలితాలు... ప్లాట్‌ఫారమ్ యొక్క ప్రభావవంతమైన అధ్యయన కంటెంట్ మరియు బోధనా పద్ధతికి నిదర్శనం. విజయవంతమైన అభ్యాసకులు ఇప్పుడు అర్హత పొందిన అభ్యర్థుల కోసం ఎన్.బి.ఈ రూపొందించిన మెరిట్ జాబితాలో చేర్చబడతారు.
మెడికల్ లో పీజీ సీటు ఆశించేవారి కోసం వీడియో లెక్చర్లు మరియు స్టడీ కంటెంట్ ద్వారా సరళీకృత అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది ప్రెప్ ల్యాడర్. జనవరి 2023లో, ప్రెప్ ల్యాడర్ డ్రీమ్ టీమ్ నెక్స్ట్ ఎడిషన్‌ను ప్రకటించింది. ఈ నెక్స్ట్ పరీక్షా విధానం ద్వారా వివిధ మెడికల్ స్పెషలైజేషన్లలోని టాప్ ఫ్యాకల్టీ సభ్యులతో శిక్షణను అందిస్తుంది. డ్రీమ్ టీమ్ నెక్స్ట్ ఎడిషన్‌లో వైద్య పరీక్షల కోసం ప్రత్యేక ఫ్యాకల్టీగా ఉంటారు. దీని ద్వారా, తాజా పరీక్షా సరళికి అనుగుణంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీటు ఆశించేవారికి మరింత ఉత్తమమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది ప్రెప్ ల్యాడర్.