Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సుప్రసిద్ధ ఆర్ధిక సేవల కంపెనీ, సింక్రోనీని ‘ఇండియాస్ బెస్ట్ వర్క్ప్లేసస్ బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ బై ఆల్ 2023’(2023 నాటికి ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించే భారతదేశపు అత్యుత్తమ కార్యక్షేత్రం)లో ఒకటిగా ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ గుర్తించింది. భారతదేశంలో టాప్ 50లో ఒకటిగా సింక్రోనీకి ర్యాంక్ అందించారు. సింక్రోనీ యొక్క ఉద్యోగులే తొలుత సంస్కృతికి మరియు తమ ఉద్యోగులకు సానుకూల, సాధికారిత కలిగిన పని సంస్కృతిని నిర్మించాలనే నిబద్ధతకు నిదర్శనంగా ఇది నిలుస్తుంది. ‘ఇండియాస్ బెస్ట్ వర్క్ప్లేసస్ బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ బై ఆల్ 2023’ టాప్ 50 ర్యాంకింగ్‌లో నిలిచిన సంస్థలను అత్యంత కఠినమైన పరీక్షా పద్థతులతో పరిశీలించి ఎంపిక చేశారు. సింక్రోనీ యొక్క గుర్తింపు ఉద్యోగి శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తుల అభ్యాసాలను అభివృద్ధి చేయడంలో దాని ప్రయత్నాలను వెల్లడిస్తుంది మరియు అధిక నమ్మకం, పనితీరు సంస్కృతిని సృష్టించాలనే అభిప్రాయానికి ముందుగా ప్రతిస్పందించడాన్ని సైతం వెల్లడిస్తుంది. సింక్రోనీ యొక్క పీపుల్ –ఫస్ట్ విధానం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రశంసలను సైతం పొందేందుకు సహాయపడింది. వీటిలో టాప్ 10 ఇండియాస్ బెస్ట్ వర్క్‌ప్లేసెస్ ఫర్ ఉమెన్ (లార్జ్) మరియు డైవర్శిటీ, ఈక్విటీ అండ్ ఇన్‌క్లూజన్ 2022 లో టాప్5గా గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా కూడా ఉన్నాయి. ఈ కంపెనీలో ప్రస్తుతం 50% మంది మహిళా ఉద్యోగులతో పాటుగా 105 మంది దివ్యాంగులు, 50కు పైగా వెటరన్స్ మరియు వెటరన్స్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇప్పటికీ, సమానమైన, వైవిధ్యమైన మరియు సమ్మిళిత వర్క్‌ప్లేస్‌ను అందరికీ అందరికీ అందించడానికి కృషి చేస్తుంది. ‘‘సింక్రోనీ వద్ద, మేము మా ప్రతి ఉద్యోగికీ మద్దతునందించే మరియు అభివృద్ధి చేసే , వారి సామర్ధ్యాన్ని మరింతగా పెంపొందించేలా సహాయపడేందుకు వీలుగా ఉద్యోగుల అభ్యాసాల కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ఏర్పాటుచేశాము’’ అని సింక్రోనీ వద్ద బిజినెస్ లీడర్ ఇండియా, ఎస్వీపీ, ఆండీ పొన్నేరీ అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘ మేము మా ఉద్యోగులకు స్ట్రాటజిక్ డిఫరెన్షియేటర్గా ప్రాధాన్యతనిస్తుంటాము మరియు ఈ గుర్తింపు మా అధిక విశ్వాస సంస్కృతి యొక్క శక్తి మరియు ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది. ఇది సానుకూల మరియు సాధికారిత కలిగిన పని వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఆవిష్కరణలు మరియు వృద్ధిని కొనసాగించడానికి మేము కొత్త సాంకేతికతలను అన్వేషించడానికి మరియు కార్యకలాపాలంతటా ఉద్దేశపూర్వక సహకారాన్ని అన్వేషించడానికి కట్టుబడి ఉన్నాము’’ అని అన్నారు. చురుకైన ప్రక్రియలను అమలు చేయడం ద్వారా మరియు వినూత్నమైన పని మరియు నిర్ణయాలను తీసుకునే పద్ధతులను పరిచయం చేయడం ద్వారా భద్రత,అనుకూలత మరియు సౌకర్యపు ఆవశ్యకతను, మరీ ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి సమయంలో సింక్రోనీ నొక్కిచెప్పింది.
భారతదేశంలో మా కార్యక్రమాలో భాగంగా అలా అమలు చేసిన ఒక కార్యక్రమంలో ఫ్లెక్సిబిలిటీ పై దృష్టి సారించి ఉద్యోగులందరూ ఇంటి నుంచి పనిచేయడానికి వీలు కల్పించాము. ఈ కార్యక్రమం ఉద్యోగుల అనుభవాలను డిజిటల్ మద్దతుతో మెరుగుపరచడంతో పాటుగా హైబ్రిడ్ ఎంగేజ్‌మెంట్‌కూ మద్దతందించింది. అదనంగా, ఈ కంపెనీ ఓ ఆవిష్కరణల కేంద్రం మరియు సాధికారిత కేంద్రం సైతం ప్రారంభించింది. తద్వారా ఆవిష్కరణల సంస్కృతిని సృష్టించింది. ఉద్యోగులను వినూత్న ఆలోచనలు చేసేందుకు ప్రోత్సహిస్తూనే, హ్యాకథాన్స్, ఛాలెంజెస్ మరియు రౌండ్‌టేబుల్ కనెక్ట్స్‌ను సైతం అందించింది.
సింక్రోనీ ఇప్పుడు అప్‌స్కిల్లింగ్ ప్రయత్నాలైనటుంవంటి సర్టిఫికెట్ రీ ఇంబర్శ్మెంట్ ప్రోగ్రామ్ మరియు క్రాస్ ఫంక్షనల్ క్రిటికల్ ఎక్స్ పీరియన్స్ అవకాశాలు వంటివి అమలు చేయడం ద్వారా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంతో పాటుగా నిత్యం మారుతున్న పరిశ్రమలో పోటీతత్త్వంతో ఉండేందుకు సైతం తోడ్పడుతుంది. ఈ కంపెనీ రోబోటిక్స్ శిక్షణ మద్దతును 9800కు పైగా విద్యార్ధులకు అందిస్తూ కోడింగ్ ప్రోగ్రామ్‌లు, కోడింగ్ ప్రోగ్రామ్‌లు, డిజిటల్ ల్యాబ్‌లను అందించడం ద్వారా తమ ఉద్యోగులకు మాత్రమే కాదు, సమాజం పట్ల తమ నిబద్ధతను సైతం ప్రదర్శిస్తుంది.
ఇండియాస్ బెస్ట్ వర్క్‌ప్లేసెస్ బిల్డింగ్ ఏ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ బై ఆల్ 2023గా సింక్రోనీ కి లభించిన గుర్తింపు , మరోమారు ఉద్యోగుల వృద్ధి, శ్రేయస్సు, ఎదుగుదల పట్ల సంస్థ నిబద్ధతను చాటడంతో పాటుగా ఆర్థిక సేవల పరిశ్రమలో అగ్రగామిగా ఉండాలనే తమ సంకల్పాన్ని సైతం వెల్లడిస్తుంది.
‘‘ఆవిష్కరణ మరియు శ్రేష్టత పరంగా భారతదేశపు ప్రయాణం, తమ మూలాలను కనుగొని ఉండవచ్చు, ఇటీవలి కాలంలో గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారడంలో పురోగతి పరంగా దేశపు సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది’’ అని గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా సీఈఓ, సీరియల్ ఎంటర్‌ప్రిన్యూర్ యశస్విని రామస్వామి అన్నారు.