Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గత 20 ఏండ్లుగా మొబైల్ రిటైల్ రంగంలో రాణిస్తున్న బిగ్ సీ ఉగాది పండగ సందర్భంగా వినూత్న ఆఫర్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. తమ వినియోగదారులకు మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్ ట్యాప్‌ల కొనుగోలపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ యం బాలు చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. మొబైల్స్ కొనుగోలుపై 10 శాతం వరకు క్యాష్ బ్యాక్, వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో మొబైల్ కొనే సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి,స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.1,500 వరకు క్యాష్ బ్యాంక్ ఇస్తున్నామన్నారు. ఆన్లైన్ కంటే తక్కువ ధరల్లో తమ రిటైల్ స్టోర్లలో ఉత్పత్తులు పొందవచ్చన్నారు. బ్రాండెడ్ అస్సెస్సరీస్పై 51 శాతం వరకు డిస్కౌంట్, ఐఫోన్ మొబైల్ కొనుగోలుపై రూ.5,000 వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్, రూ.2వేల విలువ గల అడాప్టర్‌ను ఉచితంగా ఇస్తున్నామన్నారు. 32 అంగుళాల స్మార్ట్ హెచ్డీ టీవీని కేవలం రూ.7,999కే అందిస్తున్నామన్నారు. వినియోగదారులు ఈ ఆఫర్లను ఉపయోగించుకోవాలని బాలు చౌదరి కోరారు.