Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : షావోమి భారత మార్కెట్లోకి రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32ను విడుదల చేసింది. దీని ధరను రూ.13,999గా నిర్ణయించింది. మార్చి 21 నుంచి ఇది ఆన్లైన్లో లభ్యమవుతుందని ఆ కంపెనీ తెలిపింది. దీన్ని ఓఎస్7తో ఆవిష్కరించినట్టు తెలిపింది. సౌకర్యవంతమైన స్ట్రీమింగ్ అనుభవాలను అందించే రీతిలో వైవిధ్యమైన పిక్చర్ ఇంజిన్, డాల్బీ ఆడియోను తమ శ్రేణిలో అత్యుత్తమ వినోద అనుభవాలను అందించేలా దీన్ని రూపొందించామని షావోమి ఇండియా ప్రొడక్ట్ డిప్యూటీ హెడ్ సుదీప్ సాహు తెలిపారు. వినియోగదారులకు అత్యత్తమ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ను అందించడంతో పాటుగా అత్యున్నత నాణ్యత , ఆవిష్కరణ మరియు అందుబాటు ధరల్లోని స్మార్ట్ టివి అనుభవాలను వినియోగదారుల మునివేళ్ల పై ఎంపిక అవకాశాలతో అందిస్తున్నామన్నారు.