Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్ధి రేటు ఆరు శాతం దిగువనే చోటు చేసుకోనుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) అంచనా వేసింది. ద్రవ్య పరపతి కఠిన నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ వల్ల తర్వాతి ఏడాది 2024-25లో 7 శాతం పెరుగొచ్చని ఓఈసీడీ తన 'ఫ్రాగిల్ రికవరీ'లో పేర్కొంది. ప్రస్తుత మార్చితో ముగియనున్న ఏడాదిలో 6.9 శాతం పెరుగదలను అంచనా వేసింది. గత మూడు త్రైమాసికాలుగా దేశ జీడీపీ క్రమంగా పడిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన డిసెంబర్ త్రైమాసికంలో ఏకంగా 4.4 శాతానికే పరిమితమయ్యింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతంగా, జూన్ త్రైమాసికంలో 13.5 శాతం చొప్పున పెరిగిన విషయం తెలిసిందే.