Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహాలక్ష్మీ ప్రొఫైల్స్ లిమిటెడ్ (ఎంపీఎల్) కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. హైద రాబాద్ కేంద్రంగా పని చేస్తోన్న ఈ సంస్థ పీఎల్ఐ పథకం కింద అవగా హన ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొంది. దేశంలో స్పెషాలిటీ స్టీల్లను ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించడానికి ఉక్కు ఉత్పత్తిదారుల కోసం ప్రభుత్వం చొరవ తీసుకుందని ప్రశంసించింది. శనివారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే సమక్షంలో ఒప్పందం చేసుకున్నామని ఎంపీఎల్ గ్రూపు ఎండీ వినోద్ కుమార్ అగర్వాల్ తెలిపారు.