Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పేద, సామాన్యులు ఇక బంగారం కొనలేరేమో. పది గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.60వేలు దాటింది. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై ధర రూ.1400 పెరిగి రూ.60,100కి చేరిందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ వెల్లడించింది. ఇంతక్రితం సెషన్లో ఈ లోహం ధర రూ.58,700 వద్ద ముగిసింది. తాజాగా కిలో వెండిపై రూ.1,860 పెరిగి రూ.69,340కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక్క ఔన్స్ బంగారం, వెండి ధరలు వరుసగా 2,005 డాలర్లు, 22.55 డాలర్లుగా నమోదయ్యాయి. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో చోటు చేసుకుంటున్న సంక్షోభ పరిణామాలు బంగారం ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తున్నాయి. అమెరికాలో వరుసగా బ్యాంక్‌ల మూత, క్రెడిట్ సుస్సె దివాళా వల్ల ఈ విత్త సంస్థలపై మదుపర్లకు నమ్మకం సడలిపోతోంది. దీంతో బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపడటంతో వరుసగా ధరలు పెరుగుతున్నాయి.