Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్రమత్తం కాకుంటే అనర్థమే
హైదరాబాద్: దేశంలో 7.7 కోట్ల మంది పైగా మధుమేహం తో బాధ పడుతున్నారని అబాట్ న్యూట్రిషన్ బిజినెస్ మెడికల్ అఫైర్స్ రహెడ్ డాక్టర్ ఇర్పాన్ షేక్ అన్నారు. 2045 నాటికి 13.5 కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. ఈ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంద న్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడు దశాబ్దాల్లో దేశంలో మధుమోహంతో బాధపడుతున్న వారి సంఖ్య 150 శాతం పెరిగిందన్నారు. పట్టణీకరణకు తోడు ప్రజల అహార అలవాట్లు ఈ రోగానికి ప్రధాన కారణాలన్నారు.జోస్లిన్ డయాబెటిస్ సెంటర్లోని ఇన్ పేషేంట్ డయాబెటిస్ ప్రోగ్రామ్ డైరెక్టర్, ఒబేసిటీ క్లినికల్ ప్రోగ్రామ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ఓసామా హమ్డీ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కొనసాగిస్తూ వచ్చిన అహారపు అలవాట్లను వదిలివేయడాన్ని మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గమనించవచ్చన్నారు.