Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తగ్గిన మొండి బాకీలు
- పెరిగిన లాభాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మెరుగైన ప్రగతిని కనబర్చు తున్నాయి. క్లిష్ట కాలంలోనూ మొండి బాకీలను తగ్గించుకుని.. లాభాలను పెంచుకోగలిగాయి. 2018 డిసెంబర్ ముగింపు నాటికి పీఎస్‌బీల స్థూల బ్యాంక్ నిరర్థక ఆస్తులు 14.6 శాతంగా ఉండగా.. 2022 డిసెంబర్ ముగింపు నాటికి ఏకంగా 5.53 శాతానికి తగ్గించుకోగలిగాయి. ఆర్థిక సంవత్సరం 2022-23లో ఏప్రిల్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన కాలంలో పీఎస్బీ బ్యాంక్‌ల లాభాలు రూ.70,167 కోట్లకు పెరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరడ్ సోమవారం లోకసభకు తెలిపారు. 2011-12లో అన్ని పీఎస్‌బీలు రూ.66,543 కోట్ల లాభాలు ఆర్జించా యన్నారు. దీంతో పోల్చితే 2022 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసా ల్లో పీఎస్‌బీల లాభాల్లో ఆకర్షణీయ పెరుగుదల చోటు చేసుకుంది. ఇదే సమయంలో బ్యాంక్‌ల వద్ద మూలధన లభ్యత నిష్పత్తి 11.5 శాతం నుంచి 14.5 శాతానికి పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మార్కెట్ కాపిట లైజేషన్ పెరిగింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల్లో ఐడీబీఐ బ్యాంక్ మినహా మిగితా పీఎస్‌బీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ.4.52 లక్షల కోట్ల నుంచి రూ.10.63 లక్షల కోట్లకు చేరింది.