Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడులో విజయవంతమైన ముందస్తు కార్యక్రమం తర్వాత, చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు తెలంగాణలలో అందుబాటులోకి వచ్చింది.
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (HUL), ఇప్పుడు హార్లిక్స్‌లో కొత్త రుచిని పరిచయం చేసింది. చాక్లెట్ ఫ్లేవర్లోని మిల్లెట్ హార్లిక్స్ అనేది హార్లిక్స్ ఉత్పత్తుల శ్రేణికి కొత్త చేరిక కాగా, దీన్ని దక్షిణాదిలోని అన్ని మార్కెట్లలో విడుదల చేశారు. చాక్లెట్ ఫ్లేవర్లోని మిల్లెట్ హార్లిక్స్ ఈ సూపర్ గ్రెయిన్‌తో హెచ్‌యుఎల్ మొదటి ఉత్పత్తి కాగా- దీన్ని ఫింగర్ మిల్లెట్ (రాగి), జొన్న (జోవర్), ఫాక్స్‌టైల్ మిల్లెట్ (కొర్రలు) మరియు పెరల్ మిల్లెట్ (సజ్జలు) వంటి పలు రకాల చిరుధాన్యాలతో తయారు చేశారు. మల్టీ-మిల్లెట్స్ కాల్షియం, ఐరన్, ప్రొటీన్ మరియు ఫైబర్ల సహజ మూలం కాగా, ఇవి పెరుగుతున్న పిల్లలకు కీలకమైన పౌష్ఠికతను అందిస్తాయి.
తన క్రియాశీలకమైన న్యూట్రిషన్ వ్యాపారం ద్వారా ‘బిలియన్ జీవితాలను పోషించాలనే’ హెచ్‌యుఎల్ దృష్టిలో చిరుధాన్యాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఈ ప్రయాణంలోని సవాళ్లలో ఒకటి ఏమిటంటే, సాంప్రదాయ భారతీయ చిరుధాన్యాలను బాలలు తిరస్కరించకుండా, మెరుగైన రుచిని అందించడం ద్వారా సులభంగా స్వీకరించేలా చేయడం. చాక్లెట్ ఫ్లేవర్లోని మిల్లెట్ హార్లిక్స్ ఆరేళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల రుచి ప్రాధాన్యతలను మరియు పోషక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు.
దీని విడుదల సందర్భంలో హెచ్‌యుఎల్ న్యూట్రిషన్ విభాగం ఉపాధ్యక్షుడు మరియు బిజినెస్ హెడ్ కృష్ణన్ సుందరం మాట్లాడుతూ, ‘చిరుధాన్యాలు దక్షిణ భారత గృహాలలో అంతర్భాగంగా ఉన్నాయి. పిల్లలకు అందించే మల్టీ-మిల్లెట్ ఆఫరింగ్‌లో ప్రధానమైన ఆహారాన్ని మా ఆరోగ్య-ఆహార పానీయాల విభాగంలో పరిచయం చేయడం మాకు సంతోషంగా ఉంది. భారతదేశాన్ని సూపర్ గ్రెయిన్లో గ్లోబల్ లీడర్‌గా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం. చాక్లెట్ ఫ్లేవర్‌లో మిల్లెట్ హార్లిక్స్‌ను విడుదల చేయడంతో, మేము యూనిలీవర్ ద్వారా ‘ఫ్యూచర్ ఫుడ్స్’ను నిబద్ధతతో అందించేందుకు చేరువలో ఉన్నాము. భారతదేశంలో అసమతుల్య ఆహారం, సూక్ష్మపోషక లోపం సమస్యలను పరిష్కరించే పోషకాహార పరిష్కారాన్ని రూపొందించడం మా లక్ష్యం. పిల్లల కోసం మిల్లెట్ మెయిన్ స్ట్రీమింగ్ ఈ దిశలో ఒక కీలకమైన అడుగు.
న్యూట్రిహబ్, ఐసిఏఆర్-ఐఐఎంఆర్, సీఈఓ డా.దయాకర్ రావు మాట్లాడుతూ, “మిల్లెట్లు “న్యూట్రిసిరియల్స్” వంటి ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలు, ఇతర ప్రధాన పదార్థాలలో లేని ఐరన్, కాల్షియం, మెగ్నీషియం & జింక్ వంటి ముఖ్యమైన సూక్ష్మపోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. చిరుధాన్యాల ఉత్పత్తులను అవసరమైన జీఐ మరియు పిల్లలకు అవసరమైన జీవ లభ్యత కలిగిన ఖనిజాలకు అనుగుణంగా తయారు చేయవచ్చు’’ అని తెలిపారు. దక్షిణ భారత మార్కెట్లలో మిల్లెట్ హార్లిక్స్ లాంచ్ టెలివిజన్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రచారం చేస్తుండగా, ఇందులో యూట్యూబ్, ఓటీటీ ప్లాట్‌ఫారాలు, అలాగే ముద్రణ మాధ్యమం కూడా ఉంది.
సరికొత్త మిల్లెట్ హార్లిక్స్ ప్యాక్‌లు చాక్లెట్ ఫ్లేవర్‌లో మరియు 3 ఎస్‌కెయులలో 400 గ్రాముల జార్ రూ.279 ధరతో, 400గ్రాముల పౌచ్ ధర రూ.239 మరియు 600గ్రాముల కార్టన్ (బ్యాగ్-ఇన్-బాక్స్) ప్యాక్ రూ.399కి దక్షిణ భారత మార్కెట్లలోని స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. భారత Government సిఫార్సు చేసిన తర్వాత 2023 వ ఏడాదికి ‘‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’’ యూఎన్ ప్రకటించింది.
*హార్లిక్స్ రెగ్యులర్ డైట్లో భాగంగా తీసుకోవాల్సిన పోషకమైన పానీయం. పాలు, గోధుమలు మరియు మాల్టెడ్ బార్లీల మంచితనాన్ని, ప్రోటీన్లు, జింక్, విటమిన్ సి మరియు విటమిన్ డి వంటి 23 ముఖ్యమైన పోషకాలతో పాటు సెలీనియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ బి12 మరియు విటమిన్ బి6 వంటి ఇతర రోగనిరోధక శక్తిని సపోర్టింగ్ పోషకాలను హార్లిక్స్ మిళితం చేస్తుంది.