Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కియా ఇండియా కొత్తగా బీఎస్6 ఫేస్2 నిబంధనలతో నూతన వాహనాలను ఆవిష్కరించినట్టు ప్రకటించింది. సెల్టోస్, సోనెట్, కరెన్స్ వాహనాల్లో అదనపు ఫీచర్లతో పాటుగా బిఎస్6 ఫేస్2 సాంకేతికను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. నూతన ఆర్డిఈ అనుకూల వాహనాల ధరలను రూ.7.79 లక్షల నుంచి రూ.10.89 లక్షలుగా నిర్ణయించింది. 2025 నాటికి భారత్లో విద్యుత్ వాహనాలకు ప్రధాన కేంద్రంగా మారనుందని.. తాము కూడా ఇవి6 కార్లను తీసుకురానున్నా మని కియా ఇండియా ఎండీ, సీఈఓ టయి జిన్ పార్క్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుతం ఆర్డిఈ నిబంధనలతో వాహనాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు.