Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నివాసాల్లో ఉపయోగించే కీటకనాశిని ఉత్పత్తుల సంస్థ రెకిట్ తన బ్రాండ్ మార్టిన్‌లో కొత్తగా దుర్వాసనరహిత మార్టిన్ స్మార్ట్ను ఆవిష్కరించినట్టు ప్రకటించింది. దోమల వల్ల ఏటా మలేరియా, డెంగీ వంటి వ్యాధుల కేసుల సంఖ్య పెరుగుతోందని రెకిట్ హైజిన్ దక్షిణాసియా రీజినల్ మార్కెటింగ్ డైరెక్టర్ సౌరభ్ జైన్ తెలిపారు. దోమల నివారణకు మార్టిన్ స్మార్ట్ మెరుగ్గా పని చేస్తుందన్నారు. దీన్ని గురుగావ్‌లోని మార్టిన్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ ల్యాబ్‌లో పరీక్షించామన్నారు. శాస్త్రీయంగా నిరూపించ బడిందన్నారు. 2030 నాటికి దేశాన్ని మలేరియారహితంగా చేయాలనే తమ లక్ష్యానికి మరో అడుగు దగ్గర పడిందన్నారు.