Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత, కాలమిస్ట్, కార్యకర్త హర్ష్ మందర్ నడుపుతున్న ఎన్జీఓపై కేంద్రం మంగళవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. హర్ష మందర్‌కు చెందిన ఎన్జీఓ 'అమన్ బిరాదారి' విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించిందని కేంద్రం ఆరోపించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్టర్ చేయకుండా అమన్ బిరాదారి సంస్థ విదేశీ సంస్థలైన ఆక్స్‌ఫామ్, యాక్షన్ ఎయిడ్ నుంచి రూ.2 కోట్ల విలువైన విరాళాలను పొందినట్టు కేంద్రం ఆరోపించింది. 2002 గుజరాత్ మారణహోమం అనంతరం స్థాపించిన ఈ సంస్థ మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నది. దీంతో ఈ సంస్థపై హోం మంత్రి అమిత్‌షా విచారణకు ఆదేశించినట్టు తెలుస్తున్నది.
మాందర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న 'సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్' సంస్థ మత మార్పిడి వంటి అక్రమ కార్యకలాపాల కోసం భారీగా నిధులు సేకరిస్తున్నదని కేంద్రం ఆరోపించింది. గతంలో మనీలాండరింగ్ ఆరోపణల కింద హర్ష ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను కూడా ఎదుర్కొ న్నారు. 2021 సెప్టెంబర్‌లో ఈడీ ఢిల్లీలోని వసంత్‌కుంజ్ ప్రాంతంలోని ఆయన నివాసం, కార్యాలయంతోపాటు అమన్ బిరాదారీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమీద్ అనే చైల్డ్ కేర్ సంస్థపైనా దాడులు చేపట్టింది.