Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సామ్సంగ్ హెడ్ వెల్లడి
గుర్గావ్ : ఆర్థిక మాంద్యంలోనూ ప్రీమియం ఫోన్లకు డిమాండ్ పెరుగుతోందని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఎక్స్పీరియన్స్ బిజినెస్ హెడ్ టిఎం రోV్‌ా పేర్కొన్నారు. మందగమనంలోనూ భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వృద్థి చెందుతుందన్నారు.
5జి స్మార్ట్ఫోన్లకు పెరుగుతున్న ఆదరణ వృద్థికి దారితీస్తుందన్నారు. 2023లో 5జి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 60 శాతానికి పైగా, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 30 శాతం పైనా వృద్థిని చవి చూడనుందని అంచనా వేశారు. దేశంలో 24 గంటల్లోనే ప్రీమియం గెలాక్సీ ఎస్23 సిరీస్ కోసం 1.40 లక్షల బుకింగ్స్ వచ్చాయన్నారు. ఇది గతేడాది గెలాక్సీ ఎస్22 సిరీస్ కొరకు అందిపుచ్చుకున్న ప్రీ బుకింగ్స్ కన్నా రెండింతలు ఎక్కువన్నారు. 2026 నాటికి దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 100 కోట్లకు చేరుకోవచ్చన్నారు.