Authorization
Mon Jan 19, 2015 06:51 pm
· అన్ని పెట్రోల్ పవర్ ట్రైన్స్ ఇప్పుడు ఈ20 ఫ్యూయల్ కు అనుకూలంగా ఉన్నాయి
· 160 పీఎస్, 1500 నుండి 3500 ఆర్ పీఎం గరిష్ట టార్క్ 253Nmతో కారెన్స్ లో పరిచయం చేసిన స్మార్ట్ స్ట్రీమ్ 1.5 టి-జిడిపవర్ ట్రైన్ 1.4 టి-జీడీఐని తొలగించింది
· సోనెట్ డీజిల్ 1.5 సీఆర్ డీఐ వీజీటీని పొందింది, 100 పీఎస్ నుండి ఎక్కువగా 116 పీఎస్ యొక్క పెంపొందించబడిన అవుట్ పుట్ తో డీజీల్ 1.5 సీఆర్ డీఐ డబ్ల్యూజీటీ పవర్ ట్రైన్ స్థానంలో వచ్చింది.
· డీజిల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్స్ తో వేరియెంట్స్ లో ఐఎంటీ ప్రామాణీకరణ, మేన్యువల్ ట్రాన్స్ మిషన్ ఇప్పుడు 1.5 ఇంజన్ పెట్రోల్ తో సెల్టోస్ మరియు కారెన్స్ లో మరియు పెట్రోల్ 1.2 ఇంజన్ లో సోనెట్ లో మాత్రమే లభిస్తున్నాయి.
· మోడల్స్ లో ప్రామాణిక ఫిట్మెంట్ గా ఐఎస్ జీ (ఐడల్. స్టాప్. గో) ఫీచర్ పరిచయం
· అమేజాన్ అలెక్సా కోసం కియా కనక్ట్ స్కిల్ పరిచయంతో మెరుగుపరచబడిన హోమ్ నుండి కార్ కు కనక్ట్ చేయబడిన ఫీచర్స్
దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కారు తయారీదారులలో ఒకటిగా నిలిచిన కియా ఇండియా, సెల్టోస్, సోనెట్ మరియు కారెన్స్ లో అదనపు ఫీచర్స్ మరియు అప్ డేట్ చేయబడిన పవర్ ట్రైన్ తో తమ పునరుత్తేజం చేయబడిన ఆర్ డీఈ కి అనుగుణమైన వాహన శ్రేణిని పరిచయం చేసింది. బీఎస్ 6 నియమాలు యొక్క ఫేజ్ 2కి పరివర్తనంతో శుభ్రమైన ఉద్గారాలు కోసం భారత ప్రభుత్వ కలకు అనుసంధానంగా ఇది వచ్చంది. మెరుగుపరచబడిన పవర్ ట్రైన్ తో పునరుత్తేజం చేయబడిన శ్రేణి ఇప్పుడు వచ్చింది. ఇది ఇప్పుడు ఈ20 ఫ్యూయల్ కు అనుకూలమైనది. సోనెట్ లో పెట్రోల్ ఇంజన్ మార్పు లేకుండా యథాతథంగా ఉంటుంది, కారెన్స్ లో టర్బో పెట్రోల్ ఇంజన్ - స్మార్ట్ స్ట్రీమ్ జీ1.4 టి-జీడై స్థానంలో ఇప్పుడు స్మార్ట్ స్ట్రీమ్ జీ1.5 టీ-జీడీఐ వచ్చింది. ఇది 1500 నుండి 3500 ఆర్ పీఎం మధ్య గరిష్ట టార్క్ యొక్క 253Nm మరియు 160 పీఎస్ ను ఉత్పన్నం చేస్తుంది. డీజిల్ పవర్ ట్రైన్స్ లో, సోనెట్ యొక్క 1.5 సీఆర్ డీఐ డబ్ల్యూజీటీ స్థానంలో ఇంతకు ముందున్న 100 పీఎస్ నుండి 116 పీఎస్ యొక్క మెరుగుపరచబడిన పవర్ అవుట్ పుట్ తో 1.5 సీఆర్ డీఐ వీజీటీ వచ్చింది.
భారతదేశంలో ఐఎంటీ టెక్నాలజీని అందరికీ అందుబాటులో ఉంచే మొదటి కంపెనీగా కియా ఇండియా ఈ క్లచ్ లేని మేన్యువల్ ట్రాన్స్ మిషన్ కోసం కస్టమర్స్ నుండి అనూహ్యమైన ప్రతిస్పందనను పొందింది. ఐఎంటీ సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని కియా ఇండియా మోడల్స్ యొక్క డీజీల్ మరియు పెట్రోల్ టర్బో వేరియెంట్స్ లో 6ఐఎంటీ ఇప్పుడు ప్రామాణిక ట్రాన్స్ మిషన్ గా ప్రస్తుతం లభిస్తోంది. ఈ చర్యతో, మేన్యువల్ ట్రాన్స్ మిషన్ స్మార్ట్ స్ట్రీమ్ జీ 1.5 సహజంగా ఆస్పిరేట్ చేయబడిన ఇంజన్ తో సెల్టోస్ మరియు కారెన్స్ యొక్క వేరియెంట్స్ లో మాత్రమే ఇప్పుడు లభిస్తోంది.
పవర్ ట్రైన్ కు సంబంధించిన మార్పులతో పాటు, బ్రాండ్ ఐఎస్ జీ (ఐడల్ స్టాప్ గో) ఫీచర్ ను కూడా పరిచయం చేసింది, అన్ని మోడల్స్ లో స్టాండర్డ్ గా ఇది లభిస్తోంది. ఆలోచనాత్మకమైన కనక్టెడ్ అనుభవాన్ని అందిస్తూ, అమేజాన్ అలెక్సా కోసం కియా కనక్ట్ స్కిల్ కనక్టెడ్ కార్ ఫీచర్ గా చేర్చబడింది. కనక్టెడ్ కార్ టెక్నాలజీకి ఈ చేరికతో, కియా ఇండియా హోమ్ టు కార్ కనక్టివిటీ ఫీచర్ ను తమ కస్టమర్స్ కోసం పరిచయం చేసింది. అమేజాన్ అలెక్సా అప్లికేషన్ పై నమోదు చేయడం ద్వారా కస్టమర్ వాహనానికి ద అలెక్సా డివైజ్ ను కనక్ట్ చేయవచ్చు. కస్టమర్స్ 'కియా కనక్ట్ ' ను యాప్ లో 'స్కిల్స్ మరియు గేమ్స్' విభాగంలో యాక్సెస్ చేయవచ్చు. తమ లాగ్-ఇన్ వివరాలను ఉపయోగించి తమ కియా కనక్ట్ అకౌంట్ లో లింక్ చేయవచ్చు. ఫీచర్ ఈవీ6 కస్టమర్స్ కోసం లభిస్తుంది. సోనెట్, సెల్టోస్, కారెన్స్ కోసం వరుసగా అప్ డేట్ చేయబడిన శ్రేణి ఇప్పుడు భారతదేశంలోని కియా డీలర్ షిప్స్ లో రూ. 7.79 లక్షలు, 10.89 లక్షలు మరియు 10.45 లక్షలకు లభిస్తోంది.
ఈ పురోగతి గురించి టే-జిన్ పార్క్ ఎండీ, కియా ఇండియా సీఈఓ మాట్లాడుతూ.."భారతదేశంలో ఈవీ6 ప్రారంభంతో మరియు 2025 నాటికి దేశీయంగా అభివృద్ధి చెందిన ఈవీకి నిబద్ధతతో, భారతదేశపు ప్రభుత్వం ఎలక్ట్రిక్ కలతో మా ఉత్పత్తి వ్యూహాన్ని అనుసంధానం చేయడానికి మా నిబద్ధతను ప్రదర్శించాము. ఇప్పుడు ఆర్ డీఈ నియమాలు అమలులోకి వస్తుండటంతో, వాతావరణాన్ని హరితంగా మరియు శుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు మేము మరోసారి మా తోడ్పాటును అందించడానికి ఆనందిస్తున్నాము. చేర్చబడిన ఫీచర్స్, మెరుగైన పవర్ ట్రైన్స్ తో, మా వాహనాలు మరింత ఆధునికంగా మారాయి, కియాను సొంతం చేసుకున్న కస్టమర్స్ గర్వించడానికి కారణంగా నిలిచింది. అలెక్సా మరియ ఐఎస్ జీ కోసం కియా కనక్ట్ స్కిల్ వంటి ఆధునిక ఫీచర్స్ తో కలిపిన పవర్ ట్రైన్ లో అభివృద్ధులు మా కస్టమర్స్ కు అనుభవాన్ని పొందడంలో వినోదం, సౌకర్యాన్ని నిర్థారిస్తోంది. ఈ మార్పులతో, మేము భారతదేశపు మార్కెట్ దిశగా మరోసారి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాం మరియు సుస్థిరమైన సంచారం యొక్క ప్రభుత్వ కలకు అనుగుణంగా ఉండటానికి వాగ్థానం చేస్తున్నాం." అని తెలిపారు.