Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో, ఎక్కువ మంది టర్మ్ ప్లాన్స్‌లో పన్ను ఆదా ప్రయోజనాలు పొందాలని పెట్టుబడి పెడుతుంటారు తప్ప వాటి ప్రధాన లక్ష్యాలైన ఆర్ధిక భద్రత గురించి మాత్రం కాదు. తగినంత కవరేజీతో సమగ్రమైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం సూచించడమైనది. అది కనీసం మీ రిటైర్మెంట్ వయసు నాటికి అయినా సరే తగిన రక్షణ అందిస్తుంది.
పాలసీబజార్ డాట్ కామ్ టర్మ్ ఇన్సూరెన్స్– హెడ్, రిషబ్ గార్గ్ మాట్లాడుతూ ‘‘కుటుంబసభ్యులు, స్నేహితులతో మరణం గురించి చర్చించడం ఎవరికీ ఇష్టముండదు కానీ, ఆ మరణం తప్పించలేనిదని అందరికీ తెలుసు. దురదృష్టకరమైన సంఘటనలు ఎదురైనప్పుడు కూడా కుటుంబానికి తగిన ఆర్థిక భరోసా అందించడం అత్యంత కీలకం. అలాగే వ్యాధులు, వైకల్యం బారిన పడినప్పుడు కూడా తగిన ఆరిక భరోసా పొందడం అవసరం. వాస్తవానికి ఈ అంశాలన్నీ కూడా ఆర్ధికంగా పెనుభారం కలిగించేటటువంటివే! పాలసీదారుడు అకస్మాత్తుగా మరణిస్తే అతనిపై ఆధారపడిన వ్యక్తులకు తగిన ఆర్ధిక సహకారాన్ని టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో వినియోగదారులు నిర్థేశిత కాలంలో నిర్ధేశిత ప్రీమియంలను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే ఎంచుకున్న మొత్తాలను పాలసీదారునిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు అందజేస్తారు. వీటితో పాటుగా ఈ టర్మ్ ప్లాన్స్ రైడర్స్/అదనపు కవర్స్‌ను డిజేబిలిటీ మరియు డిసీజ్ రూపంలో కూడా అందిస్తాయి.
వైకల్యం గురించి మనమెందుకు ఆలోచించాలి ? మీరు 65 సంవత్సరాలు జీవించగలిగితే మీ కుటుంబ సంరక్షణ చూసుకుంటారు? కానీ 35 సంవత్సరాలకే మీరు మరణిస్తే , కాపాడటానికి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉంది. అయితే మీరు 65 సంవత్సరాలు జీవించినప్పటికీ 35 సంవత్సరాలకే వైకల్యం బారిన పడితే, ఆ పరిస్ధితులలో డిజే బిలిటీ రైడర్ సహాయపడుతుంది. మరోవైపు క్రిటికల్ ఇల్నెస్/డిసీజ్ వంటివి ఒకరి కుటుంబ ఆర్ధిక భవిష్యత్‌పై ఎన్నో రకాలుగా ప్రభావం చూపుతుంది. దీనికి తోడు పరిమిత ఆరోగ్య భీమా ఉన్నవారు అతి తక్కువ శ్రేణి ఆరోగ్య ప్రయోజనాలకు పరిమితం కాగలరు. అందువల్ల, క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనాలు కలిగిన టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం సూచించడమైనది.
వీలైనంత త్వరగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మంచిది. కొవిడ్ భయాలు మరలా పెరుగుతున్న వేళ ఇది సూచనీయం. ఎందుకంటే, కొవిడ్ బారిన పడితే టర్మ్ ప్లాన్ కోసం మూడు నెలలు ఆగాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం వీలైనంత త్వరగా టర్మ్ ప్లాన్ తీసుకోవడం సూచించడమైనది.