Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రొక్టర్ & గ్యాంబుల్ ఇండియా సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ కలిసి మొట్టమొదటిసారిగా ఈ రకమైన బహుళ-నగరాల ‘ఉమెన్ ఇన్ స్టెమ్ కారవాన్’ రోడ్‌షోను ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో జరిగిన పి&జి ఈక్వాలిటీ ఇన్‌క్లూజన్ సమ్మి ట్ 2023లో ముగించాయి. ముగింపు వేడుకలో స్టెమ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటి క్స్) కోర్సులను అభ్యసిస్తున్న 5 మంది బాలికలకు పి&జి ఇండియా పి&జి శిక్షా బేటియా స్కాలర్‌షిప్‌ని ప్రదా నం చేసింది. ఈ బాలికలు మెరిట్ తో పాటుగా ఆర్థిక సవాళ్ల ప్రాతిపదికన స్కాలర్షిప్ కు అర్హత సాధించారు.
జి20 ఈవెంట్లలో భాగంగా అధికారికంగా గుర్తించబడిన ఈ రోడ్‌షో, విధానపరమైన నిబంధనలు, క్షేత్ర స్థాయి వాస్తవాలు, కార్పొరేట్ల పాత్ర, స్టెమ్ లో మహిళల కోసం ప్రత్యక్ష జోక్యాలపై దృష్టి సారించిన హై-పవర్ రౌండ్ టే బుల్ చర్చతో ముగిసింది. అంతర్జాతీయ విజ్ఞానశాస్త్రంలో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 11న న్యూదిల్లీలో రోడ్‌షో ప్రారంభమైంది. ఆపై జాతీయ సైన్స్ దినోత్సవం వంటి ఇతర ప్రాముఖ్యత కలిగిన ఇతర రోజులను ఉపయోగించి హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా వివిధ గమ్యస్థానాల గుండా ప్రయాణించింది. ఈ కారవాన్ ద్వారా, పి&జి ఇండియా పారిశ్రామిక శిక్షణ సంస్థలు, ఇంజినీరింగ్ కళాశా లల వంటి వివిధ సంస్థలలో స్టెమ్ కోర్సులను అభ్యసిస్తున్న 100 మంది బాలికలకు పి&జి శిక్షా బేటియా స్కాలర్‌షిప్‌ని ప్రదానం చేసింది.
తన ప్రయాణంలో, రోడ్‌షో విధాన నిర్ణేతలు, అభ్యాసకులు, విద్యావేత్తలతో సహా దీనితో ప్రమేయం గల వారంద రినీ ఒకచోట చేర్చింది, సంభాషణలకు దారితీసింది, సరైన జోక్యాలు, అవసరమైన విధాన సంస్కరణలు, ఉత్తమ పద్ధతుల అమలు ద్వారా స్టెమ్ లో మహిళా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే మార్గాలను చర్చించారు.ఈ సందర్భంగా పి అండ్ జి ఇండియా ఎండి సిఇఒ ఎల్వి వైద్యనాథన్ మాట్లాడుతూ, "ఇన్నోవేషన్ పునాదిపై నిర్మితమైన కంపెనీగా, పి అండ్ జిలోనే కాకుండా, వెలుపల ప్రపంచం లోనూ అత్యంత నైపుణ్యం కలిగిన, విభిన్నమైన స్టెమ్ వర్క్ ఫోర్స్ అవసరాన్ని మేం నిజంగా గుర్తించాం.
మొత్తం స్టెమ్ గ్రాడ్యుయేట్లలో మహిళలు 40% ఉన్నప్పటికీ, భారతదేశంలో స్టెమ్ వర్క్ ఫోర్స్ లో మహిళా ప్రాతినిధ్యం 14%కి పరిమితం చేయబడింది.పి అండ్ జిలో ఈ ప్రాతినిధ్య అంతరాన్ని తగ్గించడానికి అర్ధవంతమైన చర్యలు తీసుకోవడానికి మేం కట్టుబడి ఉ న్నాం. అని అన్నారు.ఈ సందర్భంగా సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లక్ష్మీ సంపత్ గోయల్ మాట్లాడుతూ, ‘‘బాలికలలో స్టెమ్ విద్యను ప్రోత్సహించడానికి శిక్షా బేటియా స్కాలర్షిప్ కోసం పి&జితో భాగస్వామ్యం కావడం పట్ల సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ ఎంతో ఆనందిస్తోంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల భాగస్వామ్యాన్ని రూ పొందించడానికి యువతులలో శాస్త్రీయ దృక్పథాన్ని, విచారణ స్ఫూర్తిని పెంపొందించడం అత్యవసరం. సీసీ ఎస్ భారతదేశం అంతటా ఎక్కువ మంది బాలికలను స్టెమ్ లో విద్య, వృత్తిని కొనసాగించడానికి ప్రోత్సహించడ మే కాకుండా, వారికి అవసరమైన మద్దతు, మార్గదర్శకత్వాన్ని అందించాలని కూడా భావిస్తోంది’’ అన్నారు.