Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్‌లో రెండు భారీ ఆర్డర్లు దక్కాయని తోషిబా ట్రాన్స్ మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టిటిడిఐ) తెలిపింది. జిఐఎస్ ఆంధ్రప్రదేశ్ సోలార్, విండ్ రెన్యూవబుల్ ప్రాజెక్ట్ 400కెవి పూలింగ్ సబ్స్టేషన్లలో అవుట్డోర్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్గేర్స్ (జిఐయస్) కోసం తమకు ఆర్డర్ దక్కిందని పేర్కొంది. ఎపిలోని ఆలమూరు, కోడమూరు వద్ద సోలార్, విండ్ రెన్యూవబుల్ ప్రాజెక్టు సబ్ స్టేషన్లలో 400కెవి వోల్టేజ్ లెవల్స్‌లో ఏర్పాటు చేయడానికి కాంట్రాక్టు లభించిందని పేర్కొంది. అదే విధంగా పవర్ ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ల అభివద్ధి, విస్తరణల కొరకు గోవా జెల్డెమ్లోని కొత్త రెండు 500ఎంవివి సబ్ స్టేషన్లో 400కెవి లో 23 యూనిట్లు, 220కెవిలో 9 యూనిట్లకు, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ (జిఐ యస్) కొరకు ఆర్డర్లు వచ్చినట్లుగా టిటిడిఐ సిఎండి హిరోషి ఫష్ట్రరతాలి తెలిపారు. ఈ ఆర్డర్లతో దేశంలో గ్రీన్ ఎనర్జీని ప్రవేశపెట్టే ఒక నూతన అధ్యాయనానికి దోహదపడటానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామన్నారు.