Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హిందుస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (HITS) ఇప్పుడు ఓ అవగాహన ఒప్పందాన్ని ఫ్రాన్స్ కేంద్రంగా కలిగిన ఏవియేషన్ స్కూల్–ఈ కోల్ నేషనల్ డీ ఏవియేషన్ సివిల్ (ENAC)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఎంఓయులో భాగంగా హిట్స్ ఇప్పుడు అత్యాధునిక మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను ఏవియేషన్ సేఫ్టీ మేనేజ్మెంట్లో ఇనాక్ భాగస్వామ్యంతో అందిస్తుంది. ఏవియేషన్ సేఫ్టీ మేనేజ్మెంట్/ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరేందుకు బ్యాచులర్స్/మాస్టర్స్ డిగ్రీతో పాటుగా ఏవియేషన్ పరిశ్రమలో కనీసం మూడు సంవత్సరాల ప్రొఫెషనల్ అనుభవం అవసరం. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ఎయిర్‌లైన్, ఎయిర్పోర్ట్ మరియు ఏవియేషన్ పరిశ్రమలో సంబంధిత ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించారు. ఈ ఎంఓయుపై సంతకాలను ఇనాక్ అధ్యక్షులు ఓలీవర్ చాన్సౌ ; హిట్స్ ఛాన్స్లర్ ఆనంద్ జాకోబ్ వర్గీసీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొ వైస్ ఛాన్స్లర్ అశోక్ వర్గీసీ ; ఇనాక్ వైస్ ప్రెసిడెంట్ నికోలాస్ కజలిస్ ; హిట్స్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ఎస్ ఎన్ శ్రీధర ; డిప్యూటీ డైరెక్టర్ ఇనిద్ వర్గీసీ ; హిట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అబీ శామ్ ; కెప్టెన్ రెబ్బాప్రగడ– రీజనల్ సేఫ్టీ డైరెక్టర్– సౌత్ ఆసియా ఎయిర్‌బస్ మరియు డాక్టర్ ఆర్ అశోకన్–డీన్ స్కూల్ ఆఫ్ ఏరోనాటికల్ సైన్సెస్, హిట్స్ పాల్గొన్నారు
ఈ ప్రోగ్రామ్ బోధనాంశాలు ఐసీఏఓ గ్లోబల్ ఏవియేషన్ సేఫ్టీ ప్లాన్,రోడ్‌మ్యాప్ నిర్ధేశించిన వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉండనున్నాయి. ఏవియేషన్ సేఫ్టీ మేనేజ్మెంట్లో అడ్వాన్స్డ్ మాస్టర్ ప్రోగ్రామ్‌ను సేఫ్టీ మేనేజర్స్‌కు శిక్షణ అందించడం లక్ష్యంగా ప్రారంభించారు. ఈనాక్కు చెందిన నిపుణులు విద్యార్ధులకు లెక్చర్స్ అందించడంతో పాటుగా ప్రాజెక్ట్ మెంటారింగ్/ఇంటర్న్‌షిప్‌లను ఎయిర్‌బస్ మరియు సంబంధిత ఏవియేషన్ పరిశ్రమలలో చేసేందుకు అవకాశం కల్పిస్తారు.