Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికన్ మొబైల్ బ్యాంకింగ్ సేవల సంస్థ బ్లాక్ ఆర్థిక అక్రమాలపై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో బ్లాక్ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో బ్లాక్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సంపద 526 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.4,300 కోట్లు) ఆవిరయ్యాయి. గురువారం ఇంట్రాడేలో బ్లాక్ షేర్లు 15 శాతం పతనం కాగా.. శుక్రవారం కూడా 3 శాతం పైగా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ''బ్లాక్ ఇంక్నకు చెందిన అండర్ బ్యాంక్ తన ఖాతాదారుల్లో ఎక్కువమంది నేరస్థులు లేదా అక్రమ కార్యకలాపాలలో పాల్గొన్నవారే. మోసం, ఇతర స్కామ్‌ల నిమిత్తం ఖాతాలను భారీగా సష్టించడం, ఆపై అక్రమ నిధులను త్వర త్వరగా మళ్లించడం చేసింది. ఖాతాల్లోని 40 శాతం నుండి 75 శాతం నకిలీవి, మోసానికి పాల్పడినవీ లేదా ఒకే వ్యక్తితో ముడిపడి ఉన్న అదనపు ఖాతాలే. తప్పుడు లెక్కలతో పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించింది.'' అని ఇండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే.