Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యుపిపిఎస్ ఛైర్మన్ అజయ్ గోయల్
హైదరాబాద్: భారత దేశం లో ఆహార భద్రత దిశగా కృషి చేస్తున్న ప్రస్తుత సమయంలో న్యూట్రిషన్ భద్రతకు ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం ఉందని వీట్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ సొసైటీ (డబ్ల్యుపిపిఎస్) ఛైర్మన్ అజయ్ గోయల్ అన్నారు. శుక్రవారం హైదరా బాద్లో గోధుమలు, గోధుమ ఉత్పత్తులపై డబ్ల్యుపిపిఎస్ ఓ సదస్సును నిర్వహించింది. ఈ సందర్భంగా అజయ్ గోయల్ మీడియాతో మాట్లా డుతూ.. తమ సొసైటీ 50 ఏళ్ల నుంచి పని చేస్తుందన్నారు. ఐదేళ్ల తర్వాత తాము ఈ భౌతిక సెమినార్ను నిర్వహిస్తున్నామన్నారు. గోధుమ ఉత్పత్తు లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 150 పైగా ప్రతినిధులు సహా పలు వురు న్యూట్రీషన్ విద్యార్థులు, 16 మంది నిపుణులు వివిధ అంశాలపై మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచంలో 35 శాతం మంది గోధుమ ఉత్పత్తులు తింటున్నారన్నారు. దేశంలో ఈ ఏడాది 110 మిలియన్ మెట్రిక్ టన్నుల గోధుమల దిగుబడి చోటు చేసుకోనుందన్నారు. గోధుమ దిగుమ తులపై 40 శాతం పన్ను అమల్లో ఉందని.. ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందన్నారు.