Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగారం ధర పెరగటంతో..
న్యూఢిల్లీ : బంగారం ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తమ వద్ద ఉన్న పాత అభరణాల అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. 10 గ్రాముల పసిడి ధర రూ.60వేలు దాటడంతో అమ్మకాలకు ఆసక్తి చూపుతున్నారని అభరణాల వర్తకులు తెలిపారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది వినియోగదారుల పాత ఆభరణాల అమ్మకాలు 25 శాతం మేర అధికంగా జరిగాయని పేర్కొన్నారు. భారీ స్థాయిలో పాత బంగారం అమ్మ కాలు పెరగడానికి ప్రధానంగా అధిక ధరలే కారణమన్నారు. పిల్లల చదువు ల ఖర్చుల కోసం కొంత మంది పాత బంగారాన్ని అమ్మేస్తున్నారని రిద్డీసిద్ధీ బులియన్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్విరాజ్ కొఠారి పేర్కొన్నారు. సాధారణం గా ఫిబ్రవరి, మార్చి నెలల్లో బంగారం కొనుగోళ్లు తగ్గుతాయన్నారు. మరోవైపు ఉన్న పాత అభరణాల అమ్మకాలు పెరగడం విశేషమన్నారు.