Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : జూన్ రిజిస్ట్రేషన్ విండో నేటి నుండి ఆరంభమయి మే 26, 2023 వరకు ధరకాస్తులను స్వీకరిస్తుంది. లా స్కూల్ అడ్మిషన్స్ లో ప్రపంచ అగ్రగాములయిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (LSAC) ద్వారా రూపొందించబడి మరియు పియర్సన్ వియుఇ ద్వారా పంపిణీ చేయబడే ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) అనేది భారతదేశం అంతటా ఉన్న సంస్థలలో స్థానం పొందాలనుకునే భావి అభ్యర్థుల కోసం ప్రముఖ లా స్కూల్ ప్రవేశ పరీక్ష. ప్రోగ్రామ్‌తో అనుబంధంగా ఉన్న 12 సంస్థల ఆమోదం కోసం అభ్యర్థులు తమ పరీక్ష స్కోర్లను పరిగణనలోకి తీసుకోగలరు.
సంస్థల జాబితా
1. జిందాల్ గ్లోబల్ లా స్కూల్, ఒ.పి.జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం
2. యూపిఈఎస్
3. బి.ఎం.ఎల్. ముంజాల్ విశ్వవిద్యాలయం
4. జి.డి. గోయెంకా విశ్వవిద్యాలయం
5. విఐటి చెన్నై స్కూల్ ఆఫ్ లా (విఐటిఎస్ఓఎల్)
6. అలయన్స్ విశ్వవిద్యాలయం
7. ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయం
8. ఆసియన్ లా కాలేజ్
9. ఐఎస్ బీఆర్ లా కాలేజ్
10. లాయిడ్ లా కాలేజ్
11. మేవార్ విశ్వవిద్యాలయం
12. శోభిత్ విశ్వవిద్యాలయం
జూన్ నమోదు ప్రక్రియ 2023 మే 26 తో ముగుస్తుంది. పరీక్ష షెడ్యూల్ 17 ఏప్రిల్ - 29 మే 2023 వరకు అందుబాటులో ఉంటుంది మరియు జూన్ పరీక్ష 2023 జూన్ 8 నుండి జూన్ 11 వరకు బహుళ స్లాట్లలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు www.lsatindia.in nu సందర్శించి నమోదు చేసుకుని తమ పరీక్ష కోసం నమోదు చేసుకోవాలి.
జనవరి 2023 నమోదు విండో విజయవంతమైన తరువాత ఒపి జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయంలోని లా అడ్మిషన్స్ డైరెక్టర్ మరియు జిందాల్ గ్లోబల్ లా స్కూల్ (జెజిఎల్ఎస్) అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ ఆనంద్ ప్రకాష్ మిశ్రా మాట్లాడుతూ, "మా 5-సంవత్సరాల బీకామ్ఎల్ఎల్బి (BComLLB), బిఎల్ఎల్బి (BALLB) మరియు బిబిఎఎల్ఎల్బి (BBALLB) ఆనర్స్ ప్రోగ్రామ్‌లలో 100% సీట్లు ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) స్కోర్ల ఆధారంగా మాత్రమే భర్తీ చేయబడతాయి. అలాగే జిందాల్ గ్లోబల్ లా స్కూల్లో చదువుకోవడానికి 400 స్కాలర్షిప్లు 10% నుండి 75% వరకు ట్యూషన్ ఫీజును తల్లిదండ్రుల ఆదాయం నిర్దేశిత పరిమితుల్లో ఉంటే ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) స్కోర్ల ఆధారంగా ఇస్తారు. 5-సంవత్సరాల లా, 3 సంవత్సరాల ఎల్ఎల్బి లేదా ఒక సంవత్సరం ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్‌లను లక్ష్యంగా పెట్టుకున్న భారతదేశంలోని ప్రతి న్యాయ ఔత్సాహికుడికి ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) జూన్ 2023 తప్పనిసరి.
ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) జనవరి 2023 ఫలితాల ప్రకారం ఇప్పటికే 500 మందికి పైగా విద్యార్థులు జెజిఎల్ఎస్ (JGLS) లో చేరారు. విద్యార్థులు జెజిఎల్ఎస్ (JGLS) లో చేరాలనుకుంటే జూన్ 2023 పరీక్షకు నమోదు చేసుకుని పూర్తి సన్నద్ధతతో రాయాల్సిన సమయం ఆసన్నమైంది. మన దేశంలో ఏ లా ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఈ పరీక్ష యొక్క శాస్త్రీయ విధానం, వాస్తవికత మరియు ఉన్నత ప్రమాణాలకు సరిపోలదని నేను విద్యా దృక్పథం నుండి చెప్పాలనుకుంటున్నాను. ఏ లా స్కూల్లో చేరాలనుకునే విద్యార్థులతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ తమ లాజిక్, రీజనింగ్ స్కిల్స్, లా చదవడానికి ఉన్న అర్హతను అంచనా వేయడానికి ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) ను ఎంచుకోవాలి.”
అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కోసం భారతదేశంలోని లా కాలేజీలు ఉపయోగించే ప్రముఖ లా ఎంట్రన్స్ పరీక్షల్లో ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) ఒకటి. ఎనలిటికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగాలతో కూడిన ఎల్ఎస్ఏటి-ఇండియా™ (LSAT-India™) అడ్వాన్స్డ్ రీడింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇన్ఫార్మల్ మరియు డిడక్టివ్ రీజనింగ్ స్కిల్స్ ఆధారంగా లా అభ్యర్థుల నైపుణ్యాలను అంచనా వేసే ప్రామాణిక పరీక్ష. పరీక్షలో 92 ప్రశ్నలకు 2 గంటల 20 నిమిషాల్లో సమాధానాలు రాయాలి. స్కేల్డ్ స్కోర్, పర్సంటైల్ ర్యాంక్ రెండింటితో ఫలితాలను నివేదిస్తారు.
పరీక్ష తీసుకునేవారికి గరిష్ట ప్రాప్యత సౌలభ్యాన్ని అందించడానికి, పరీక్ష సమగ్రతను నిర్ధారించడానికి రిమోట్ ప్రొక్టరింగ్ తో ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా పరీక్ష భారతదేశం అంతటా పంపిణీ చేయబడుతుంది. ఇంటి నుండి పరీక్షను యాక్సెస్ చేసుకోవడానికి, అభ్యర్థులు పరీక్షకు అవసరమైన వ్యవస్థ మరియు వాతావరణం ఉండేలా చూసుకోవాలి. వ్యవస్థ ఆవశ్యకతలు మరియు పరీక్ష సన్నాహము తో సహా పరీక్షకు సంబంధించిన అన్ని సంబంధిత సమాచారాన్ని తనిఖీ చేయడానికి అభ్యర్థులు తరచుగా అడిగే ప్రశ్నలను సందర్శించాలి.