Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ మరియు ఆర్ఎంసీ కంపెనీ అలా్ట్రటెక్ సిమెంట్ లిమిటెడ్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన TERI-IWA-UNDP వాటర్ సస్టెయినబిలిటీ అవార్డు 2022 ను ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ (TERI), ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ (IWA) మరియు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP ) సహకారంతో అంతర్జాతీయ నీటి దినోత్సవం 2023 సందర్భంగా అందజేసింది. ఈ అవార్డును అలా్ట్రటెక్‌కు రెండవ వాటర్ సస్టెయినబిలిటీ అవార్డులు 2022–2023 వేడుకలో అందజేశారు. న్యూఢిల్లీలో ఈ కార్యక్రమం మార్చి 21,2023 వద్ద జరిగింది. అలా్ట్రటెక్ను ‘వాటర్ ఫర్ ఆల్’ విభాగం కింద గుర్తించారు. అలా్ట్రటెక్ యొక్క ఇంటిగ్రేటెడ్ సిమెంట్ తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ తమ యూనిట్‌కు దగ్గరలోని రెండు గ్రామాలలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ కోసం ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిటీ నీటి నిర్మాణాలను కాపాడటంతో పాటుగా పునరుద్ధరించడాన్ని స్థానిక ప్రజల జీవితాలు, జీవనోపాధి వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్నారు.
వాటర్‌షెడ్ మేనేజ్మెంట్ ద్వారా జీవనోపాధి మెరుగుపరచడం
పాక్షిక మరియు తీవ్ర కరువు ప్రాంతాలున్నటి వంటి ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో నీటి కొరత సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని తాడిపత్రి వద్దనున్న ఆంధ్రప్రదేశ్ సిమెంట్ వర్క్స్ (ఏపీసీడబ్ల్యు), అయ్యవారిపల్లి (అనంతపూర్ జిల్లా) మరియు పెట్నికోట (నందాల్య జిల్లా) గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో దత్తత తీసుకోవడంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ ప్రాజెక్ట్ అమలు చేసింది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సంవత్సరానికి 30% చొప్పున అడుగంటి పోతున్నాయి. ఈ యూనిట్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద సెమి–అరిడ్ ట్రోపిక్స్ (ఇక్రిశాట్)తో భాగస్వామ్యం చేసుకుని ఈ ప్రాజెక్ట్ అమలు చేయడంతో పాటుగా నీటి కొరత, భూసార క్షీణత, తక్కువ పంట దిగుబడి సమస్యలను పరిష్కరించడం ద్వారా గ్రామస్తుల ఆదాయ స్థాయి మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.
కొలిమిగుండ్ల మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం తో పాటుగా తాడిపత్రి మండలంలోని పెట్నికోట గ్రామంలో ఏడు వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చేయడం ద్వారా భూగర్భ జలాల స్థాయిలను మెరుగుపరచడంతో పాటుగా సంవత్సరమంతా నీటి లభ్యతకు భరోసా అందించారు. రైతులకు మెరుగైన వ్యవసాయ పద్ధతుల పట్ల శిక్షణ అందించడంతో పాటుగా ఆదాయ సృష్టి కార్యక్రమాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. భూ వినియోగం కోసం అత్యుత్తమ ప్రక్రియలను గురించి ప్రదర్శనలను చేయడంతో పాటుగా పంట దిగుబడి పెంచేందుకు పంట నిర్వహణ గురించి కూడా వెల్లడించారు.
అధిక దిగుబడి అందించే పంట విత్తనాలను ఇక్రిశాట్ అభివృద్ధి చేయడంతో పాటుగా 250–280 ఎకరాల వ్యవసాయ భూమిలో రైతులు వినియోగించేందుకు పంపిణీ చేసింది. ఈ రెండు గ్రామాలలో రైతులకు భూసార పరీక్షలకు సంబంధించి సాయిల్ హెల్త్ కార్డ్‌లను సైతం పంపిణీ చేశారు. భూసార పరిస్థితులను బట్టి ఎరువులు మరియు పురుగుమందుల వినియోగం పట్ల రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కారణం చేత ఎరువులు, పురుగు మందుల వినియోగం గణనీయంగా తగ్గింది. తద్వారా సాగు ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. ఇళ్లకు కిచెన్ గార్డెన్ విత్తనాలు సైతం పంపిణీ చేయడంతో పాటుగా అదనపు ఆదాయం పొందడం కోసం స్ధానిక మహిళలను ప్రోత్సహిస్తున్నారు.