Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్, టెక్ పరిశ్రమలోని కంపెనీలపై నెలకొన్న ప్రతికూలాంశాలు ఓయో పబ్లిక్ ఇష్యూపై పడిందని స్పష్టమవుతోంది. ఓయో బ్రాండ్‌తో ఆతిథ్య రంగంలో అగ్రిగేటర్‌గా ఉన్న ఓరావెల్ స్టేస్ లిమిటెడ్ తన ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) పరిమాణాన్ని తగ్గించుకోవాలని యోచిస్తోందని రిపోర్టులు వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు తోడు కొత్తతరం టెక్ కంపెనీలు పలు ప్రతీకూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఓయో తన ఇష్యూ పరిమాణాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ఐపిఒకు సంబంధించి వారం రోజుల్లో మరోసారి ముసాయిదా పత్రాలను సమర్పించనుందని తెలుస్తోంది. కాగా.. ఇష్యూ పరిమాణాన్ని మూడింతలకు తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2021లో రూ.8,430 కోట్ల నిధుల సమీకరణ కోసం ఐపిఒకు దరఖాస్తు చేసుకోగా.. పలు కారణలతో ఇది వాయిదా పడుతోంది. ముసాయిదా పత్రాల్లో చాలా లోపాలు ఉన్నాయని.. మార్పులు చేసి పంపించాలని 2022 డిసెంబర్లో ఓయోను సెబీ ఆదేశించింది. దీనికి సంబంధించిన గడువు అతి త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి సవరించిన అంచనాలు, ముసాయిదా పత్రాన్ని ఈ వారంలోనే సెబీకి సమర్పించే అవకాశం ఉంది.