Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 రాష్ట్రాలలో 1,50,000 పండ్ల చెట్లను నాటడం ద్వారా అట్టడుగు రైతులకు సహాయపడటానికి ఉపహార్ ఒక జోక్యం
- 5 మెగా పట్టణాలలో 100 కలక్షన్ పాయింట్లలో సమాజాలకు చైతన్యం కలిగించడం ద్వారా 2500 ఎంటీ ప్లాస్టిక్ ను తగ్గించే లక్ష్యాన్ని కలిగిన D.R.O.P. (డవలప్ రెస్పాన్సిబుల్ అవుట్ లుక్ ఫర్ ప్లాస్టిక్)
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కారు తయారీదారులలో ఒకటైన కియా ఇండియా, అట్టడుగు స్థాయిలలో ప్రభావాన్ని కలిగించడానికి తమ రెండు జాతీయ కమ్యూనిటీ చొరవలు - D.R.O.P. (డవలప్ రెస్పాన్సిబుల్ అవుట్ రీచ్ ఫర్ ప్లాస్టిక్) మరియు ఉపహార్ లను అమలుచేయడం ఆరంభించింది. ఆటో ఎక్స్ పో 2023లో మొదట ప్రకటించింది, సుస్థిరమైన ప్రపంచాన్ని రూపొందించడానికి ఈ రెండు చొరవలు కియా వారి అంతర్జాతీయ సీఎస్ఆర్ కల "పరిశుభ్రమైన వాతావరణం" మరియు "స్వేచ్ఛాయుతమైన మరియు సురక్షితమైన ఉద్యమం" తో అనుసంధానం చేయబడ్డాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు గురించి ప్రమాదకరమైన ఆందోళనను పరిష్కరించి మరియు జలాశయాలు, ల్యాండ్ ఫిల్స్ లో అది వ్యాపించడాన్ని తగ్గించే లక్ష్యాన్ని D.R.O.P. కలిగి ఉండగా, ఉపహార్ చొరవ అట్టడుగు వర్గానికి చెందిన వ్యవసాయ సమాజానికి మద్దతు ఇవ్వడానికి చెట్లను నాటే కార్యక్రమంగా ఆరంభించబడింది మరియు వాతావరణం మార్పుతో పోరాడుతోంది. మొదటి ప్రాజెక్ట్ 5 మెగా పట్టణాలలో చురుకుగా ఉంది-గురుగ్రామ్, ముంబయి, బెంగళూరు, విజయవాడ మరియు విశాఖపట్టణం, కాగా రెండవది 15 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశ్సా, ఉత్తర్ ప్రదేశ్, హర్యాణా, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మరియు హిమాచల్ ప్రదేశ్ లలో పని చేస్తోంది.
ఈ చొరవ గురించి మాట్లాడుతూ, "శ్రీ టే-జిన్ పార్క్, ఎండీ & సీఈఓ, కియా ఇండియా, ఇలా అన్నారు, "బాధ్యతాయుతమైన వ్యాపారంగా ఉండటం అనేది భారతదేశంలో దీర్ఘకాలం మరియు సుస్థిరమైన వ్యాపారాన్ని రూపొందించడానికి ముందుగా అవసరమైన విషయం. 2021లో మా బ్రాండ్ పునః ప్రారంభించిన నాటి నుండి, 'ప్రేరేపించబడే ఉద్యమం' అనేది మా కీలకమైన సిద్ధాంతంగా ఉంది మరియు దానిలో సుస్థిరత చాలా ప్రధానమైన అంశం. ఈ రెండు-కమ్యూనిటీ చొరవలతో, వాతావరణానికి అనుకూలంగా తోడ్పడటానికి బహుళ సమాజాలను ప్రేరేపించడానికి మేము పరిశీలిస్తున్నాము మరియు మా భాగస్వాములు మరియు ఎన్జీఓల సహాయంతో రాబోయే సంవత్సరాలలో దీని ప్రభావం మరియు చేరికలను వ్యాప్తి చేయాలని ఆశిస్తున్నాము."
D.R.O.P. గురించి
D.R.O.P. అనగా అంతిమంగా ల్యాండ్ ఫిల్స్ మరియు జలాశయాల్లో అంతమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు యొక్క అంతర్జాతీయ ఆందోళనను పరిష్కరించడానికి రూపొందించబడింది. ఇండియా పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్ - IPCA సహకారంతో ఆరంభించబడిన, ఈ ప్రాజెక్ట్ స్థానిక సమాజాలు మరియు వివిధ భాగస్వాములకు అవగాహన కలిగించి మరియు వారి సహకారం ద్వారా ప్లాస్టిక్ సేకరణ వ్యవస్థను శక్తివంతం చేయడం ద్వారా 5 మెగా పట్టణాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి మరియు రీసైకిల్ చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. ప్రతి పట్టణంలో 100 కలక్షన్ పాయింట్స్ లో సమాజాలకు చైతన్యం కలిగించడం ద్వారా 2500 ఎంటీ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి బ్రాండ్ కట్టుబడింది. దీనితో పాటు, వ్యర్థాలను సేకరించే పనివారికి ఈ ప్రాజెక్ట్ ఒక జీవనోపాధి అవకాశంగా పరోక్ష ప్రయోజనాలను కేటాయిస్తుంది మరియు తాము ఉన్న ప్రదేశం మరియు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడాన్ని నిర్వహించడంలో సమాజాలకు సహాయపడుతోంది.
ఉపహార్ గురించి
ఉపహార్ అనగా చెట్లను నాటే కార్యక్రమం. సంకల్పతరు ఫౌండేషన్ ద్వారా ఈ చొరవ ఆరంభించబడింది. మానవాళి మరియు ప్రకృతి పై వ్యతిరేకమైన పర్యావసానాలు నివారించడానికి వాతావరణం మార్పుతో పోరాడటానికి ప్రాజెక్ట్ రూపకల్పన చేయబడింది. అట్టడుగు వ్యవసాయ సమాజాలకు సహాయాన్ని అందించడం ద్వారా, వివిధ ప్రదేశాలలో హరిత ప్రాంతాలలో వ్యవసాయ భూములను పునరుత్తేజం కలిగించడానికి దృష్టి సారించింది. మొక్కలను నాటే కార్యక్రమం కార్బన తగ్గించే చర్యగా మాత్రమే కాకుండా గ్రీన్ హౌస్ వాయువులను మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది మరియు అట్టడుగు వర్గాలకు చెందిన వ్యవసాయ సమాజాల జీవనోపాధి అవకాశాలు, సంక్షేమాన్ని ప్రోత్సహించడం ద్వారా వారికి మద్దతు కూడా కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా, కియా ఇండియా 15 రాష్ట్రాలలో 150,000 పండ్ల చెట్ల మొక్కలను (యాపిల్, పీచ్, జామ, నారింజ, నిమ్మ-నారింజ మరియు కొబ్బరి) నాటుతుంది. ఆటో ఎక్స్ పో 2023 సమయంలో ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 100,000 చెట్లను నాటడం ద్వారా సుమారు 150 మంది రైతులకు ప్రయోజనం కలిగించింది.
కియా ఇండియా గురించి
అనంతపురం జిల్లాలో తయారీ సదుపాయం నిర్మించడానికి 2017 ఏప్రిల్ లో, కియా ఇండియా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహనా ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. 2019 ఆగస్ట్ లో కియాపెద్ద మొత్తంలో ఉత్పత్తి ఆరంభించింది మరియు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 300,000 యూనిట్లు సాధించింది. 2021 ఏప్రిల్ లో , కియా ఇండియా ఆధునిక ప్రోడక్ట్స్ మరియు సేవల మద్దతు ద్వారా కస్టమర్స్ కు అర్థవంతమైన అనుభవాలను అందచేసే లక్ష్యంతో తమ కొత్త బ్రాండ్ గుర్తింపు, ప్రేరేపించే సంచారానికి అనుగుణంగా తనను పునః చిత్రీకరించుకుంది. కొత్త బ్రాండ్ గుర్తింపు క్రింద, కియా కొత్త ప్రమాణాలు సాధించడానికి మార్గాలను కనుగొనడానికి మరియు విజయాలు సాధించడానికి వినియోగదారులను ప్రేరేపించడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు, కియా ఇండియా భారతదేశపు మార్కెట్ కోసం 5 వాహనాలను విడుదల చేసింది- ద సెల్టోస్, ద కార్నివాల్, ద సోనెట్, ద కారెన్స్, మరియు ఈవీ6. కియా ఇండియా అనంతపురం ప్లాంట్ నుండి 8.6 లక్షలకు పైగా పంపిణీ చేసింది, వీటిలో 6.75 లక్షల దేశీయ సేల్స్ మరియు 1.9కి పైగా ఎగుమతులు ఉన్నాయి. భారతదేశపు రోడ్లు పై 2.97 లక్షలకు పైగా కనక్టెడ్ కార్స్ తో, దేశంలో ఇది కనక్ట్ చేయబడిన కారు నాయకులలో ఒకటిగా ఉంది. బ్రాండ్ కు విస్త్రతమైన 339 టచ్ పాయింట్స్ నెట్ వర్క్ ఉంది మరియు దేశవ్యాప్తంగా తన ఉనికిని శక్తివంతం చేయడం పై దృష్టిసారించింది.
కియా కార్పొరేషన్ గురించి
కియా (www.kia.com)అంతర్జాతీయంగా సంచరిస్తున్న బ్రాండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు, సమాజాలు, వర్గాలకు సుస్థిరమైన ప్రయాణం పరిష్కారాలను తయారు చేయాలని కలలు కంటున్న బ్రాండ్. 1944లో స్థాపించబడిన, కియా 75 సంవత్సరాలకు పైగా ప్రయాణ పరిష్కారాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 52,000 మంది ఉద్యోగులతో , 190 మార్కెట్లలో తన ఉనికితో, ఆరు దేశాలలో తయారీ సదుపాయాలతో , కంపెనీ నేడు సుమారు మూడు మిలియన్ వాహనాలను ఏటా విక్రయిస్తుంది. కియా ఎలక్ట్రిపైడ్ మరియు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాచుర్యం కల్పించడానికి ప్రయత్నిస్తోంది మరియు ప్రయాణ సేవలు యొక్క పెరుగుతున్న శ్రేణిని అభివృద్ధి చేస్తోంది, ప్రయాణించడానికి ఉత్తమమైన విధానాలు అన్వేషించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రజలను ప్రోత్సహిస్తోంది. కంపెనీ వారి బ్రాండ్ నినాదం - 'ప్రేరేపించే సంచారం' - తన ప్రోడక్ట్స్ మరియు సేవలు ద్వారా వినియోగదారులను ప్రేరేపించడానికి కియా యొక్క కట్టుబాటును ప్రతిబింబిస్తోంది. మరింత సమాచారం కోసం, కియా గ్లోబల్ మీడియా సెంటర్ ను www.kianewscenter.com పై చూడండి.