Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోల్డ్‌మాన్ శాక్స్ హెచ్చరిక
న్యూఢిల్లీ : కృత్రిమ మేధస్సు (ఎఐ)తో ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఉద్యోగాలు ఊడొచ్చని గోల్డ్‌మాన్ శాక్స్ హెచ్చరించింది. ఎఐ టెక్నాలజీతో కొన్ని ఉద్యోగాలు కనుమరుగు కావొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. నిర్వహణ, న్యాయ సేవల రంగాలపై పెను ప్రభావం ఉండొచ్చని తెలి పింది. ఎఐ ఆటోమేషన్ అధికంగా ఉన్న అమెరికా, యూరప్‌లో మూడింట ఒక్క వంతు ఉద్యోగాలను భర్తీ చేయగల సామర్థ్యం ఎఐకి ఉందని అంచనా వేసింది. ఎఐతో 44 శాతం న్యాయ సేవల ఉద్యోగాలు, 46 శాతం నిర్వహణ విభాగంలో సిబ్బంది తమ ఉనికిని కోల్పోవచ్చని తెలిపింది. నిర్మాణ రంగంలో 6 శాతం, మెయింటనెన్స్ రంగంలో 4 శాతం చొప్పున ఉద్యోగాలు పోవచ్చని పేర్కొంది. ఇటీవల చాట్‌జిపిటి తరహా టెక్నాలజీ రాకతో అనేక ఉద్యోగాలు పోవచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ టెక్నాలజీ వల్ల ముఖ్యంగా వినియోగదారుల సేవల రంగంలోని ఉద్యోగు లు ఎక్కువగా ప్రభావితం కానున్నారని చాట్‌జిపిటి ప్రతినిధులే పేర్కొం టున్న విషయం తెలిసిందే.