Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెవిటాస్ అల్ట్రా టైర్ల విడుదల
హైదరాబాద్ : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ జెకె టైర్ కొత్తగా ప్రీమియం కార్లకు ఉపయోగించే లెవిటాస్ అల్ట్రా శ్రేణీ టైర్లను దక్షిణాది మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని మంగ ళవారం హైదరాబాద్లో జెకె టైర్ అండ్ ఇండిస్టీస్ ఎండి అన్షుమన్ సింఘానియా, అధ్యక్షులు అనూజ్ కథూరియాలు ఆవిష్కరించారు. ఇది పొడి, తడి నేలలు, బ్రేకింగ్, క్యాబిన్ లోపలి శబ్దాల పరంగా అసాధారణ పనితీరును కనబర్చనున్నాయని సింఘానియా, కథూరియాలు తెలిపారు. వారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. భారత్లో తమకు తొమ్మిది, మెక్సికోలో మూడు చొప్పున తయారీ ప్లాంట్లు ఉన్నాయన్నారు. ఏడాదికి 3.2 కోట్ల యూనిట్ల సామర్థ్యం కలిగి ఉన్నామన్నారు. దేశంలో ప్రస్తుతం ఈ పరిశ్రమ రూ.70,000 కోట్ల విలువ చేస్తుందని.. 2025 నాటికి రూ.1 లక్ష కోట్లకు చేరొచ్చని అంచనా వేశారు. తమ కంపెనీ రెండంకెల వృద్థిని సాధిస్తుందన్నారు. భారత్లో లగ్జరీ కార్ల వినియోగం భారీగా పెరుగుతుందన్నారు. నూతన లెవిటాస్ అల్ట్రా శ్రేణీ టైర్లు ఏప్రిల్ 1 నుంచి కీలక నగరాల్లో లభ్యమవుతాయన్నారు.